కోరి అడిగితే కోతి అయినా కొండెక్కి కూర్చుంటుంది. అలాంటిది ఓ రేంజ్ హీరోయిన్ అయితే..ఇప్పుడు అదే జరిగింది. అసలే రూపాయి రూపాయి ఆచి తూచి ఖర్చు చేస్తూ, చిరంజీవి 150 వ సినిమా నిర్మాణం సాగిస్తున్నారు. కానీ ఇప్పటికీ హీరోయిన్ సెట్ కాలేదు. బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన జాక్విలిన్ ఫెర్నాండెజ్ ను చిరు ఎంచుకున్నారు.
సరే, వెంటనే ఆమెను కాంట్రాక్టు చేస్తే ఓకె అన్నదట. కానీ అక్కడితో అయిపోలేదు సంబరం.పారితోషికం జస్ట్ అయిదు కోట్లు అడిగిందట. చిరు సినిమా ఇది..అందునా 150 వ సినిమా అని కూడా చెప్పారని..' అయితే నాకేంటీ' అనే టైపులో అయిదుకోట్లు ఫిక్స్ అనే ఆన్సర్ వచ్చిందని వినికిడి. దీంతో చిరు మళ్లీ పట్టువదలని విక్రమార్కుడు భేతాళుడ్ని భుజాన వేసుకుని బయల్దేరినట్లు హీరోయిన్ వేట మళ్లీ మొదలు పెట్టారని వినికిడి.