Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రేమ పెళ్లికి దోషాలేమిటి?

ప్రేమ పెళ్లికి దోషాలేమిటి?

జాతకంలో కాల సర్పదోషం వున్నా, కుజదోషం వున్నా శ్రీకాళహస్తి లేదా మరి కొన్ని పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజులు చేసుకుంటారు చాలా మంది నమ్మకం వున్నవాళ్లు. హీరోయిన్ సమంత గతంలో అలాంటి పూజలు చేసుకుంది..పైగా ఒంటరిగా కాదు, హీరోయిన్ సిద్దార్థతో కలిసి. బహుశా అవి గుర్తుకు వచ్చి వుంటాయి. 

సమంత జాతకంలో కుజదోషం వుందని, నాగ్ చైతన్య జాతకంతో మాచ్ కాలేదని, కింగ్ నాగార్జున పరిష్కార శాంతి కార్యక్రమాల గురించి ఆరా తీస్తున్నారని వదంతులు వినిపించడం ప్రారంభమైంది. ఆ వదంతులు గ్యాసిప్ లుగా మారడం కూడా ప్రారంభమైంది. 

చిత్రమేమిటంటే..ప్రేమించి పెళ్లి చేసుకునేవారు ఇలాంటివి అన్నీ చూసుకుంటారా? జాతకాలు మ్యాచ్ అయ్యాయి, బ్లడ్ గ్రూపులు మాచ్ అయ్యాయా? అన్నవి చూసుకుంటారా? అభిరుచులు కలిసాయా లేదా అని చూసుకుంటారు కానీ. అయినా అక్కినేని ఫ్యామిలీ ఆది నుంచి కాస్త ఎథీస్ట్ లక్షణాలున్న ఫ్యామిలీ. నాగ్ కొన్నేళ్లుగా కాస్త భక్తి పెంచుకున్నాడు తప్ప.. చాదస్తాలు కాదు.. అందువల్ల శామ్.. చైతూల పెళ్లికి రాహువు.. కేతువు అడ్డం పడకపోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?