Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జగపతి బాబు మళ్లీ విలన్ గా

జగపతి బాబు మళ్లీ విలన్ గా

బోయపాటి శీను ఏ ముహుర్తాన జగపతి బాబును విలన్ గా మార్చేసాడో..ఇక వెర్సటైల్ ఆర్టిస్టుగా మారిపోయాడు. రకరకాల విలన్ పాత్రలు వేసేస్తున్నాడు. ఒక విధంగా ప్రకాష్ రాజ్ ను మన నిర్మాతలు, దర్ళకులు మరిచిపోయేట్లు చేసేసాడు.

లేటెస్ట్ బజ్ ఏమిటంటే జగపతి బాబును మరో విలన్ క్యారెక్టర్ వరించనుందని. దిల్ రాజు..వేణు శ్రీరామ్ కలిసి హీరో నాగార్జున కు వినిపించిన కథలో మాంచి విలన్ క్యారెక్టర్ కూడా ఉందంట. ఆ క్యారెక్టర్ కు జగపతిబాబును అనుకుంటున్నామని వారు నాగ్ కు వెల్లడించారని వినికిడి.

నాగ్ కు జగపతిబాబుకు మంచి సాన్నిహిత్యం వుంది. గతంలో ఓసారి జగపతి బాబు హీరోగా నాగ్ ఆహా అంటూ ఓ సినిమా కూడా నిర్మించాడు. పాత్ర వెరైటీగా వుండడం, జగపతి బాబు ఇప్పుడు విలన్ గా మంచి పామ్ లో వుండడంతో నాగ్ కూడా ఊ అన్నాడని  వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?