సన్నీలియోన్ మళ్ళీ ఓ తెలుగు సినిమాలో నటించనుంది. ఆ మధ్య 'కరెంట్ తీగ' సినిమా కోసం సన్నీలియోన్‌ని టాలీవుడ్‌కి తీసుకొచ్చాడు హీరో మనోజ్. ఆ సినిమా కోసం సన్నీలియోన్‌కి బాగానే ముట్టజెప్పారు. అలా ఇలా కాదు, హీరోయిన్‌కి మించి, సన్నీలియోన్‌కి చెల్లించుకోవాల్సి వచ్చింది. 'అదో పెద్ద కథ..' అంటూ మనోజ్ ఓ సందర్భంలో నిట్టూర్చాడు కూడా.
ఎంత సొమ్ములిస్తేనేం.. సన్నీలియోన్‌కి వున్న హాట్ ఇమేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్లో సన్నీలియోన్ ఓ వెలుగు వెలుగుతోంది. పచ్చి బూతు సినిమాలే చేస్తున్నా, సన్నీలియోన్‌కి వున్న గిరాకీ అంతా ఇంతా కాదు. అడల్ట్ సినిమాల్లో.. అదేనండీ పోర్న్ సినిమాల్లో నటించేసిన సన్నీలియోన్‌ని చూసేందుకు ఓ వర్గం సినీ ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే వుంటున్నారు. దాంతో, సన్నీలియోన్ గిరాకీ అలా ఇలా కాదు, ఓ రేంజ్లో వుంది.
అప్పట్లో తెలుగులోకి సన్నీలియోన్‌ని తీసుకురావడానికి అర కోటికి పైనే చెల్లించుకోవాల్సి వచ్చిందట. ఇప్పుడు కోటి దాటేసి, రెండు కోట్ల దాకా బాలీవుడ్లో ఛార్జ్ చేస్తున్న సన్నీలియోన్‌ని, అంత ఖర్చు పెట్టి, తెలుగులోకి ఎవరు తెప్పిస్తారబ్బా.? అంటే, ఓ బ్యానర్లో.. భారీగా ఖర్చు చేసి బాలీవుడ్ తరహా అడల్ట్ కామెడీ సినిమా ఒకటి చేయాలనే ఆలోచనతో.. ఆ ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే, అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఫైనల్ అవుతాయట. ఓ యంగ్ హీరో ఈ సినిమాలో నటించనున్నాడట.