జైలవకుశ లాభం 36 కోట్లు?

జై లవకుశ. దసరా సీజన్ సినిమాల హాట్ టాపిక్ ల్లో ఒకటి. ఈ సినిమా ఎన్టీఆర్ స్వంత బ్యానర్ లాంటి ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఈ సినిమాను చాలా తక్కువలో…

జై లవకుశ. దసరా సీజన్ సినిమాల హాట్ టాపిక్ ల్లో ఒకటి. ఈ సినిమా ఎన్టీఆర్ స్వంత బ్యానర్ లాంటి ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఈ సినిమాను చాలా తక్కువలో కానిచ్చేసారని, సుమారు 60కోట్ల వరకు లాభాలు వెనకేసుకున్నారని, ఇలా చాలా కబుర్లు వినిపించాయి. అయితే అసలు లెక్కలు ఏమిటి? ఆరా తీస్తే..?

జై లవకుశ సినిమాకు మంచి లాభాలు వచ్చిన మాట వాస్తవమేనట. అన్ని ఖర్చులు పోగా, ప్రచారం, ఎన్టీఆర్ రెమ్యూనిరేషన్, ఇలా అన్నీ తీసేయగా, బ్యానర్ కు 36కోట్లు లాభం వచ్చినట్లు తెలుస్తోంది. సినిమాకు అందరూ అనుకుంటున్నట్లు తక్కువేమీ ఖర్చు కాలేదట.

120 వర్కింగ్ డేస్ షూట్ చేయాల్సి రావడంతో ప్రొడక్షన్ కాస్ట్ కాస్త భారీగానే అయింది. అదే విధంగా కళ్యాణ్ రామ్ సన్నిహిత బంధువు హరి స్వంత కంపెనీ నే అయినా గ్రాఫిక్స్ కూ బాగానే ఖర్చయిందట. మూడు క్యారెక్టర్లు కావడంతో సెకెన్ల లెక్కన గ్రాఫిక్స్ కు బాగానే ఖర్చయిందని తెలుస్తోంది.

ఇక పబ్లిసిటీ విషయంలొ జైలవకుశ ఎక్కడా రాజీ పడడం లేదు. కేవలం ఎఫ్ఎమ్ రేడియో పబ్లిసిటీకే 20లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు వినికిడి. ఇక ప్రింట్, విజువల్ మీడియా అన్నింటికీ కలిపి కోట్లలో ఖర్చు చేస్తున్నారు. అందువల్ల ఈ ఖర్చులన్నీ తీసేయగా 36కోట్లు లాభం వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే కళ్యాణ్ రామ్ తన స్వంత బ్యానర్ పెట్టిన నాటి నుంచి ఇవ్వాల్టి దాకా సినిమాలు తీయడం ద్వారా ఏదయినా నష్టపోయి వుంటే, ఆ నష్టం మొత్తం జై లవకుశ ద్వారా కవర్ అయిపోయినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఫుల్ సౌండ్ పార్టీ. ఎంత సౌండ్ పార్టీ అయినా నష్టాల లెక్కలు లెక్కలేగా. ఆ లెక్కలన్నీ ఇప్పుడు ఒక్క సినిమాతో ఫక్కాగా బ్యాలెన్స్ అయిపోయాయి. థాంక్స్ టు బ్రదర్ ఎన్టీఆర్ అనుకోవాలి కళ్యాణ్ రామ్.