సంక్రాంతికి ఎట్టిపరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలి. అందుకే పాటల్ని పక్కనపెట్టి టాకీపై దృష్టిపెట్టారు. అలా ఏకథాటిగా చేసిన షెడ్యూల్స్ తో జై సింహా సినిమా ఓ కొలిక్కి వచ్చింది. తాజాగా విశాఖలో చేసిన ఓ భారీ షెడ్యూల్ తో ఈ సినిమా టాకీ 70శాతం కంప్లీట్ అయింది. ఈనెల 22నుంచి డిసెంబర్ 1వరకు మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీంతో సినిమాకు సంబంధించి టోటల్ టాకీ కంప్లీట్ అయిపోతుంది.
జై సింహా సినిమాకు సంబంధించి పాటలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. అలా పెండింగ్ లో ఉన్న పాటల్ని డిసెంబర్ లో వరుసగా కంప్లీట్ చేయాలని నిర్ణయించాడు బాలయ్య. ఈ మేరకు నయనతారను అడిగి కాల్షీట్లు కూడా తీసుకున్నారు. హరిప్రియ, నటాషాతో కాల్షీట్ల సమస్య లేదు.
డిసెంబర్ లో పాటల్ని కంప్లీట్ చేసి జనవరి 12న జై సింహాను రిలీజ్ చేస్తారు. డిసెంబర్ 23న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ప్లాన్ చేశారు. చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.