నంది అవార్డుల వివాదం వీలయినంత చల్లారకుండా అన్ని తరహాల మీడియా యథాశక్తి ప్రయత్నిస్తూనే వున్నాయి. అవార్డులను విమర్శిస్తున్నవారు ఎవరి వాదనలు వారు వినిపిస్తూనే వున్నారు.
లేటెస్ట్ గా ఆంధ్రజ్యోతి ఓ ఓపెన్ డిబేట్ నిర్వహించింది. ఆ డిబేట్ లో జ్యూరీ సభ్యుడు చెప్పిన విషయం వింటే, నంది అవార్డు సంపాదించడం మరీ ఇంత చీప్ నా అన్నట్లుంది.
జ్యూరీ సభ్యుడికి ఓ స్కాచ్ బాటిల్ పంపారట. ఫలానా వాళ్లు పంపారన్నారు కానీ ఎందుకు అన్నది చెప్పలేదట. అంటే ఆ ఫలానావాళ్లకు ఫేవర్ గా వుండాలన్నది అన్యాపదేశంగా వుండి వుంటుందన్నది చంటి వెల్లడించిన వాస్తవం. స్కాచ్ బాటిల్ మహా అయితే వేలల్లో వుంటుంది.
అందరికీ కలిపి మహా అయితే లక్షో, రెండు లక్షలో అవుతుంది. అంటే కాస్త ప్రొఫైల్ వుండి, లక్షో, రెండులక్షలో ఖర్చు చేసుకుంటే నంది అవార్డు స్వంతం అయిపోతుందన్నమాట. భలే మంచి చౌకబేరము.