బాలయ్య 102వ సినిమా మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. బాలయ్య సినిమాలకు ఓ స్పెషాలిటీ వుంది. సినిమా ఎలా వుంటుంది? విడుదలయిన తరువాత ఎలా వుంటుంది అన్న సంగతి పక్కన పెడితే, విడుదల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఓ భలే సందడి వుంటుంది. టీజర్లు, ట్రయిలర్లు, ఫ్యాన్స్ హంగామా అంతా ఓ రేంజ్ లో వుంటుంది.
బాలయ్య 102వ సినిమా జైసింహా కూడా ఇప్పుడు హడావుడి స్టార్ట్ చేసింది. రెండు మూడు రోజుల క్రితం టీజర్ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు ట్రయిలర్ వస్తోంది. బాలయ్య సినిమా ట్రయిలర్ అంటే రెండు విషయాలు కచ్చితంగా వుంటాయి. ఒకటి దబిడి దిబిడి అంటూ ఫైట్లు. రెండో పవర్ ఫుల్ డైలాగులు.
ఇలాంటి డైలాగులకు పెట్టింది పేరయిన డైమండ్ రత్నం జై సింహాకు రచయిత. అందువల్ల ట్రయిలర్ లో ఈ టైపు డైలాగులు బాగానే వుంటాయి. కెఎస్ రవికుమార్ డైరక్టర్ కాబట్టి భారీ యాక్షన్ సీన్లు వుంటాయి. ఈ సాయంత్రం ట్రయిలర్ బయటకు వస్తుంది బాలయ్య ఫ్యాన్స్ హడావుడి మొదలవుతుంది.