ఎవరు ఎంత కాదన్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు, స్టయిలిష్ స్టార్ బన్నీకి మధ్య పరోక్ష వార్ నడుస్తోంది. ఇది వాస్తవం. బన్నీ తో మరో సినిమా చేయకుండా డైరక్టర్ త్రివిక్రమ్ కు పవన్ నే అడ్డం పడ్డారనే గుసగుసలు వున్నాయి. అందుకే త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమా సెట్ మీదకు వెళ్లడానికి ముందు బోలెడన్ని రోజులు ఖాళీగానే వున్నారు.
ఇలాంటి నేపథ్యంలో జనవరి 1న నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా స్పెషల్ టీజర్ వస్తోంది. ఇది టీజర్ అనే దాని కన్నా మినీ ట్రయిలర్ అనాలేమో? అయితే అంతకన్నా ముందుగానే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ట్రయిలర్ రావాల్సి వుంది. క్రిస్మస్ కు వస్తుందని అనుకున్నారు.
కానీ వచ్చే సూచనలు కనిపించడం లేదు. జనవరి ఫస్ట్ కే వస్తుందని వినికిడి. ఒక రోజు ఇటుకానీ అటు కానీ కావచ్చు. అంటే దాదాపు బన్నీ సినిమా టీజర్ టైమ్ కు అటు ఇటుగా అన్నమాట.
అజ్ఞాతవాసి ట్రయిలర్-నాపేరు సూర్య టీజర్.. కచ్చితంగా చిన్నకంపారిజన్ అయితే వస్తుంది. పైగా యూ ట్యూబ్ లైక్ లు, యూ ట్యూబ్ హిట్ లు ఇవన్నీ కూడా లెక్కలు తీస్తారు. ఫ్యాన్స్ కదా? ఎలా వుంటుందో మరి చూడాలి.