జైలుకైనా వెళ్తా..బెదిరింపులకు లొంగను

బండ్లగణేష్ కు తన సినిమాకు తోంభై శాతం పాజిటివ్ రివ్యూలు వచ్చాయన్న సంతోషం లేకుండా పోయింది. ఎప్పటిదో గబ్బర్ సింగ్ నాటి వ్యవహారం ఒకటి ఇప్పుడు పైన పడింది. కేసు పడింది. కోర్టుకెక్కింది. దీంతో…

బండ్లగణేష్ కు తన సినిమాకు తోంభై శాతం పాజిటివ్ రివ్యూలు వచ్చాయన్న సంతోషం లేకుండా పోయింది. ఎప్పటిదో గబ్బర్ సింగ్ నాటి వ్యవహారం ఒకటి ఇప్పుడు పైన పడింది. కేసు పడింది. కోర్టుకెక్కింది. దీంతో ఆయన ఆ వ్యవహారాలు చూసుకోవడంతో సరిపోతోంది. ఇలాంటి నేపథ్యంలో విడుదలకు ముందు రోజే బండ్ల గణేష్ కనిపించడం లేదని, పరారీలో వున్నారనీ ఇలా రకరకాల వార్తలు వినవచ్చాయి. 

అయితే విడుదలకు రెండు రోజుల ముందు సింహాచలం వెళ్లారనీ, విడుదల మర్నాడు తిరుపతి వెళ్లారనీ సన్నిహిత వర్గాల బోగట్టా. ఆఖరికి గ్రేట్ ఆంధ్రకు బండ్ల గణేష్ ఫోన్ లో దొరికారు. ఎప్పుడో తీన్ మార్ నాటి వ్యవహారం అని. తప్పుడు కాగితాలతో తనను బ్లాక్ మెయిల్ చేయాలని కేసు వేసారని, ఒకరితో కాంప్రమైజ్ అయితే మరొకరు వస్తారని, అందుకే లొంగేది లేదని ఆయన తెగేసి చెప్పారు. 

అవసరమైతే జైలుకైనా వెళ్తా కానీ, బెదిరింపులకు లొంగనన్నారు. తాను ఎక్కడికీ పరారైపోలేదని, అందుబాటులోనే వున్నానని, పోలీసులను కలిసి,. అవసరైమైన కాగితాలు అన్నీ ఇచ్చానని చెప్పుకొచ్చారు. నిర్మాతలు ఇవ్వాళ నానా బాధలు పడుతున్నారని, ఒక సినిమా సెట్ చేసి, నిర్మించి, విడుదల చేయాలంటే నరాలు తెగిపోతున్నాయని, పైగా ఇలాంటి సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తోందని అన్నారు. భగవంతుడి దయ వల్ల గోవిందుడు అందరి వాడేలే సినిమాకు మంచి టాక్ వచ్చిందని, శ్రమ ఫలించిందని ఆయన అన్నారు.