జానకి పై వత్తిడి ఇంత అంతా కాదు

ఈ నెల 11న మూడు సినిమాలు ఒకేసారి విడుదల కావడం కాదు కానీ, ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ అయి కూర్చుంది. మూడు సినిమాలు రావడం కాదు కానీ, ఎవ్వరికీ పెద్దగా ప్రయోజనం వుండదన్న…

ఈ నెల 11న మూడు సినిమాలు ఒకేసారి విడుదల కావడం కాదు కానీ, ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ అయి కూర్చుంది. మూడు సినిమాలు రావడం కాదు కానీ, ఎవ్వరికీ పెద్దగా ప్రయోజనం వుండదన్న భయం పట్టుకుంది. కానీ ఎవరికి వారికే వెనక్కు వెళ్లడానికి ఇగో సమస్యలు. కానీ అదే సమయంలో ఎదుటివాడిని ఎలా వెనక్కు పంపాలా అన్న రాజకీయాలు ఊపందుకున్నట్లు కనిపిస్తోంది.

విడుదల కానున్న మూడు సినిమాల్లో జయ జానకీ నాయక సినిమాకు ఓపెనింగ్స్ బాగా వుంటాయన్న టాక్ వుంది. ఎందుకంటే దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కు ఆ క్రేజ్ వుంది. ఇప్పుడు ఆ సినిమాను వెనక్కు పంపాలి. అదే సమయంలో మరోపక్క బయ్యర్లకు కూడా కాస్త ఆందోళన. అన్నింటికన్నా ఎక్కువ బిజినెస్ చేసింది ఆ సినిమానే. అందువల్ల ఆ రేంజ్ కలెక్షన్లు రావాలంటే, కాస్త ఫ్రీటైమ్ లో రావాలి. అందుకే ఇప్పుడు అందరూ కలిసి జయ జానకి నాయక సినిమాను 24కు వాయిదా వేయించాలని ప్రయత్నిస్తున్నట్లు వినికిడి.

బయ్యర్ల నుంచి వస్తున్న వత్తిడికి నిర్మాత రవీందర్ రెడ్డి, హీరో తండ్రి బెల్లంకొండ సురేష్ కొంతవరకు ఓకె అన్నట్లు సమాచారం. కానీ దర్శకుడు బోయపాటి మాత్రం ససేమిరా అంటున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ 11కు రావాల్సిందే అన్నది బోయపాటి నిర్ణయంగా వుంది. ఈ విషయమై రెండు రోజుల బట్టి జరుగుతున్న చర్చలు, మంగళవారం మరీ స్పీడందుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చలు సాగుతూనే వున్నాయి.

డిస్ట్రిబ్యూషన్ వర్గాలు జానకి సినిమా వాయిదా పడుతుందని 24కు వస్తుందని అంటున్నాయి. కానీ జానకి వర్గాలు మాత్రం, ఇంకా ఏ విషయం కన్ ఫర్మ్ కాలేదని అంటున్నాయి.