త్రివిక్రమ్ శ్రీనివాస్-బన్నీ సినిమా వ్వవహారం మొత్తానికి ఓ కొలిక్కి వచ్చింది. జస్ట్ నాలుగైదు రోజుల క్రితమే ఫైనల్ హియరింగ్ అయిపోయి, స్క్రిప్ట్ ఓకె అయిందని తెలుస్తోంది. ఆ తరువాత ఏ బ్యానర్ మీద నిర్మించాలన్న దానిపై కూడా ఓ ఐడియాకు వచ్చేసారు.
ఈ మేరకు హారిక హాసిని చినబాబుతో బన్నీ ఫాదర్ అల్లు అరవింద్ ఓ రౌండ్ డిస్కషన్లు పూర్తిచేసారు. మూడు వంతులు రెండు బ్యానర్ల పేర్లు వుండే అవకాశం వుంది. అలాగే అల్లు అరవింద్, చినబాబు పేర్లు కూడా. అయితే ఎవరి షేర్ ఎంత అన్నది ఇంకా డిసైడ్ కాలేదని తెలుస్తోంది. మేజర్ షేర్ గీతాదే వుంటుందని వినికిడి.
ఇదిలావుంటే మారుతి చెప్పిన లైన్ కూడా బన్నీ ఓకె చేసినట్లు తెలుస్తోంది. అయితే అది ఎప్పుడు వుంటుంది అన్నది మారుతి స్క్రిప్ట్ ను పెర్ ఫెక్ట్ గా తయారుచేసి అందించడాన్ని బట్టి వుంటుంది. త్రివిక్రమ్-బన్నీ సినిమా ప్రకటన జనవరిలో, షూట్ ఫిబ్రవరి నుంచి వుంటాయి.