థమన్ మళ్లీ మరో మెలోడీ

థమన్ మంచి మ్యూజిక్ డైరక్టర్ నే. కానీ మనసుపెట్టి చేస్తేనే. అలా కాకుండా ఇలా మెషీన్ లో పెట్టి అలా తీసి ఇస్తే, జిరాక్స్ లే వస్తాయి. తొలి ప్రేమ సినిమాకు మాంచి మెలోడీలు…

థమన్ మంచి మ్యూజిక్ డైరక్టర్ నే. కానీ మనసుపెట్టి చేస్తేనే. అలా కాకుండా ఇలా మెషీన్ లో పెట్టి అలా తీసి ఇస్తే, జిరాక్స్ లే వస్తాయి. తొలి ప్రేమ సినిమాకు మాంచి మెలోడీలు అందించాడు థమన్. మళ్లీ అదే డైరక్టర్ వెంకీ అట్లూరి డైరక్షన్ లో చేస్తున్న సినిమా మిస్టర్ మజ్ఞు.

ఈ సినిమా సాంగ్ ఒకటి ఈరోజు వదులుతున్నారు. ఏమైనదో.. ఏమైనదో.. పలుకుమరచి పలుకు మరచినట్లు పెదవికి ఏమైనదో.. బరువు పెరిగినట్లు గండెకేమైనదో…అంటూ సాగిన సాంగ్ ను క్లాస్ ప్లస్ మెలోడీ టచ్ తో అందించాడు థమన్.

పెద్దగా ఇనుస్ట్రుమెంటేషన్ హడావుడి లేకుండా, అలా అని రిథమ్ లో లైట్ బీట్ ను జోడిస్తూ ట్యూన్ చేసాడు ఈ సాంగ్ ను. కొన్నాళ్ల పాటు ఎఫ్ఎమ్ ల్లో లవర్స్ కోసం డెడికేషన్లు సాగుతాయి ఈ పాటతో. శ్రీమణి అందించిన సాహిత్యం సింపుల్ గా బాగుంది.

అయితే హీరో అఖిల్ కు ఇలాంటి సాంగ్ ముఖ్యంగా ఈ తరహా ఫీలింగ్ లు ప్రదర్శించడం ఇదే తొలిసారి. హలోలో లవర్ బాయ్ క్యారెక్టర్ చేసినా, ఇలా మరీ ఫీల్ వున్న సాంగ్ కు యాక్ట్ చేయలేదు. మిస్టర్ మజ్ఞు పాటతో పాటు వదిలిన విజువల్స్ లో అఖిల్ హావభావాలు ఫరావాలేదనట్లు వున్నాయి.

విడియో వస్తే, అఖిల్ ఈ ఫీల్ వున్న పాటకు ఏ మేరకు న్యాయం చేసాడు అన్నదానిపై క్లారిటీ వస్తుంది.