ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు. కథానాయకుడు, మహానాయకుడు. సినిమా రెండుభాగాలే కానీ, ట్రయిలర్ ఒకటే. అడియో ఒకటే. అన్ని తరహాల సాంగ్స్ కలిపి 11 పాటలు. అన్నీకలిపి సింగిల్ అడియోగా విడుదల చేస్తారట. అదే విధంగా తొలిభాగానికి ఒక ట్రయిలర్, మలి భాగానికి మరో ట్రయిలర్ అన్న వ్యవహారం వుండదట.
అంటే ఈనెల 16న విడుదల చేసే ట్రయిలర్ లోనే ఫిబ్రవరిలో విడుదల చేసే మహానాయకుడు కంటెంట్ కూడా వుంటుందన్నమాట. అలాగే ఈ అడియోలోనే ఆ పార్ట్ పాటలు కూడా పెట్టేస్తారు. అంటే మాగ్జిమమ్ అన్ని విధాలా మెటీరియల్, పబ్లిసిటీ మొత్తం కథానాయకుడుకే.
ఐడియా ఒకె అనుకున్నా, ఇప్పుడు ఇంత ప్రచారం చేసి, స్టిల్స్ వదిలి, అడియో, ట్రయిలర్ కూడా ఒకటే చేస్తే కథానాయకుడు వరకు బజ్, ప్రచారం సూపర్ గా వుంటుంది. కానీ మళ్లీ మహానాయకుడు సినిమాకు కావాలంటే ఏం వుంటుంది మెటీరియల్.
పైగా రెండోభాగం ఫుల్ పొలిటికల్. గ్లామర్ తక్కువ వుంటుంది. పొలిటికల్ జర్నీపై మాంచి ఎమోషనల్ ట్రయిలర్ చేస్తే బాగుంటుందన్న ఐడియాను వదిలేసి, ఇలా సింగిల్.. సింగిల్ అన్న ప్లాన్ ఎందుకు చేసినట్లో?