చిరకాలంగా వినిపిస్తొంది ప్రభాస్-రాధాకృష్ణల సినిమాకు జాను అనే వర్కింగ్ టైటిల్. కానీ అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు. ఇలాంటి నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు తమిళ మూవీ 96 రీమేక్ స్టార్ట్ చేసారు. తెలుగులో మరీ 96 వరకు వెళ్లడం లేదు. 2000 రేంజ్ వరకు మాత్రమే వెనక్కు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సినిమాకు 96 టైటిల్ సెట్ కాదు. సరైన టైటిల్ కోసం చూస్తుంటే జాను టైటిల్ కనిపించింది.
ఎందుకంటే 96 రీమేక్ లో కథానాయిక సమంత పేరు జానకి అలియాస్ జాను. అందువల్ల సినిమాకు జాను అన్న టైటిల్ పక్కా యాప్ట్ గా వుంటుందని నిర్మాత దిల్ రాజు భావన. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రభాస్ సినిమా నిర్మాతలు యువి వంశీ, ప్రమోద్ లతో దిల్ రాజుకు మంచి సంబందాలు వున్నాయి. వ్యాపార బంధాలు వున్నాయి.
వీటన్నింటి దృష్ట్యా, జాను టైటిల్ ను తనకు ఇవ్వమని దిల్ రాజు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒకటి రెండు మీటింగ్ లు జరిగాయి. యువి అధినతలు దిల్ రాజు కోరికను ఆల్ మోస్ట్ మన్నించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం కూడా ఇంకా అధికారికంగా బయటకు రావాల్సి వుంది.