చూస్కుందాం.. మీ ప్రతాపం.. మా ప్రతాపం అన్నట్లు మారుతోంది అల్లు అర్జున్-మహేష్ బాబుల సినిమాల మధ్య వ్యవహారం. బన్నీ ప్రకటించిన డేట్ కు మహేష్ బాబు తన సినిమా భరత్ అనే నేను డేట్ ప్రకటించడంతో వచ్చింది సమస్య. ఈ విషయంలో డౌట్ లేదు, మహేష్ బాబు సినిమా యూనిట్ దే తోందరపాటు అన్నది ఇండస్ట్రీ టాక్. అందుకే ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదంటున్నాయి నా పేరు సూర్య యూనిట్ వర్గాలు.
ఒకే ఒక్క పరిస్థితుల్లో తమ సినిమా వెనక్కు, ముందుకు మారుతుందని, అదేంటంటే, రోబో సినిమా కనుక జనవరిలో కాకుండా సమ్మర్ లో వస్తే మాత్రమే అని అంటున్నారు. జనవరి 1న రిలీజ్ డే పోస్టర్ విడుదల చేస్తామని గీతా వర్గాలు పేర్కొన్నాయి. అవసరం అయితే అన్నీ ముందుగానే ప్రకటిస్తామని, అంతే తప్ప వెనక్కు వెళ్లేది లేదని అంటున్నారు.
మరి అల్లు అర్జున్ సినిమా యూనిట్ ఇంతలా పట్టుదలగా వుంటే మహేష్ బాబు ఏం చేస్తారో? అసలే హిట్ అనివార్యం అయిన పరిస్థితిలో వున్నారు. అలాంటపుడు పంతాలకు పోవడం కన్నా, సరైన డేట్ చూసుకోవడం బెటరేమో?