జవాన్ మరి కాస్త వెనక్కి?

పాపం సాయిధరమ్ తేజ. అతగాడి సినిమాలూ అలాగే వుంటున్నాయి. అవి వెనక్కు వెనక్కు నడుస్తూ ఢమాల్ మనడమూ అలాగేవుంది. లేటెస్ట్ గా జవాన్ సినిమా ఇలాగే వెనక్కు వెనక్కు జరుగుతోంది. Advertisement ఈ సినిమా…

పాపం సాయిధరమ్ తేజ. అతగాడి సినిమాలూ అలాగే వుంటున్నాయి. అవి వెనక్కు వెనక్కు నడుస్తూ ఢమాల్ మనడమూ అలాగేవుంది. లేటెస్ట్ గా జవాన్ సినిమా ఇలాగే వెనక్కు వెనక్కు జరుగుతోంది.

ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. రీరికార్డింగ్ కు థమన్ దగ్గరకు వెళ్లింది. సినిమా చూసి అతగాడు ఫీడ్ బ్యాక్ ను నిర్మాత దిల్ రాజుకు ఇవ్వడం, అక్కడితో ఆ సినిమాను పక్కనపెట్టడం జరిగిపోయినట్లు గుసగుసలు వినిపించాయి. 

ఆ తరువాత మరేం చేసారో, చేయలేదో? నవంబర్ 3న విడుదలకు రెడీ చేస్తున్నారని వార్తలు వినవచ్చాయి. కానీ ఇప్పుడు కొత్త డేట్ వినిపిస్తోంది. డిసెంబర్ 1న విడుదల చేయాలని చూస్తున్నారట.

అప్పుడయితే గ్రౌండ్ ఖాళీగా వుందట ప్రస్తుతానికి. అందువల్ల ఓపెనింగ్స్ కు, రికవరీకి పెద్దగా ఇబ్బంది వుండదని అనుకుంటున్నారేమో? అయినా సాయిధరమ్ తేజ సినిమాలకు ఎందుకు ఇలా జరుగుతోందో?