రెండు బయోపిక్ ల్లో వెన్నుపోట్లే కీలకం

న్టీఆర్ బయోపిక్ ల హడావుడి స్టార్ట్ అయింది. బాలయ్య నటిస్తూ, పార్టనర్ షిప్ లో నిర్మించే ఈ సినిమాలో కావచ్చు, వర్మ నిర్మించే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో కావచ్చు? ఆంధ్ర చంద్రబాబు పాత్ర ఏ…

న్టీఆర్ బయోపిక్ ల హడావుడి స్టార్ట్ అయింది. బాలయ్య నటిస్తూ, పార్టనర్ షిప్ లో నిర్మించే ఈ సినిమాలో కావచ్చు, వర్మ నిర్మించే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో కావచ్చు? ఆంధ్ర చంద్రబాబు పాత్ర ఏ మేరకు వుంటుందన్నది కీలకంగా వుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టి, గెలిచి, అధికారం చేపట్టి, వెన్నుపోటు కారణంగా గద్దె దిగి, దానిపై పోరాటం సాగించి, మళ్లీ అధికారం చెపట్టడంతో బాలయ్య నిర్మించే బయోపిక్ పూర్తవుతుంది.

ఈ వెన్నుపోటు పోరాటంలో చంద్రబాబుదే కీలక పాత్ర అన్న సంగతి అందరికీ తెలిసిందే. బెంగుళూరులో ఎమ్మెల్యేల క్యాంప్ రన్ చేసి, మొత్తం కీలక పాత్ర పోషించింది చంద్రబాబునే.  నాదెండ్ల వెన్నుపోటు, ప్రజాస్వామ్య పోరాటమే సినిమాకు క్లయిమాక్స్ కాబట్టి, ఈ ఎపిసోడ్ లో బాబు పాత్ర వుండాల్సిందే. 

ఇక వర్మ రూపొందించే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అసలు ప్రారంభం కావడమే లక్ష్మీ పార్వతి ఎంట్రీతో ప్రారంభం అవుతుంది. ఎన్టీఆర్ గద్దె దిగడం, ఆ తరువాతి దురుదృష్టకర సంఘటలు క్లయిమాక్స్ గా వుంటుంది. అంటే ఇక్కడా చంద్రబాబు పాత్ర కీలకం అవుతుంది. 

అంటే రెండు సినిమాల్లో చంద్రబాబు పాత్రను ఎవరు పోషిస్తారో కానీ, భలేగా వుండే అవకాశం వుంది. ఫేస్ పెద్దగా మ్యాచ్ కాదని కానీ, బాలయ్య బయోపిక్ లో చంద్రబాబు పాత్ర లో నారా రోహిత్ నటిస్తారేమో అన్న ఫీలర్లు వున్నాయి. ఎందుకంటే ఎలాగూ సోదరుడి కుమారుడే కదా. ఇక వర్మ అయితే బాబు ఫేస్ లాంటి ఫేస్ ను ఎక్కడి నుంచో గ్యారంటీగా తెస్తారు. మొత్తం మీద రెండు సినిమాలు పేర్లు వేరయినా, బాబూస్ ఎన్టీఆర్ అన్నట్లే వుంటాయి.