బ్రహ్మోత్సవం లాంటి భారీ సినిమాలు దెబ్బతీసాయి కానీ, క్షణం, ఘాజీ లాంటి మీడియం సినిమాలు ఆదుకంటూనే వున్నాయి నిర్మాత పివిపిని. ఇప్పుడు రాజుగారి గది 2 కూడా విడుదలకు ముందే సేఫ్ జోన్ లోకి చేరిపోయింది.
ఈ సినిమా శాటిలైట్ సూపర్ రేట్ కు ఓ చానెల్ ఎగరేసుకుకపోయినట్లు తెలుస్తోంది. ఈ డీల్ వల్ల పివిపి సంస్థకు 8కోట్లు వచ్చింది. హిందీ డబ్బింగ్, డిజిటల్, ఆల్ రైట్స్ రెండు కోట్లకు ఇచ్చేసారు. అంటే అక్కడే టోటల్ 10కోట్ల రికవరీ అయిపోయింది. ఇక ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, సీడెడ్, కర్ణాటక అమ్మేసారు. అక్కడ ఏడు నుంచి ఎనిమిది రికవరీ అయిపోయింది.
అంటే టోటల్ ఖర్చు పెట్టినది అంతా వచ్చేసినట్లే. ఇక పంచుకోవడానికి లాభాలు రావాలి. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, పివిపి, పల్స్ డైరక్టర్ ఓంకార్ షేర్ అన్నమాట. అందుకోసం నైజాం, వైజాగ్, ఓవర్ సీస్ వుండనే వున్నాయి. ప్రస్తుతానికి మంచి ఓపెనింగ్స్ వుండేలా కనిపిస్తున్నాయి. బుకింగ్ ఏప్స్ లో ఫస్ట్ డే ఫుల్స్ అప్పుడే బాగానే కనిపిస్తున్నాయి. థియేటర్లు అన్నీ ఖాళీగా వున్నాయి కాబట్టి, థియేటర్ల సమస్య వుండదు. సో. పివిపి సంస్థకు ఇదే నిజమైన బ్రహ్మోత్సవం అనుకోవాలి.