బాలయ్య నిర్మాత కమ్ హీరోగా చేయబోయే ఎన్టీఆర్ బయోపిక్ కు ఏర్పాట్లు స్పీడందుకున్నాయి. తండ్రి పాత్రలో బాలయ్య కనిపించడం అన్నది పక్కా అయిపోయింది. మిగిలిన పాత్రల సెలక్షన్ వుంది. కానీ అసలు సిసలు పాత్ర ను ఎవరు ఫోషిస్తారన్నది తేలాలి.
అదే బాలయ్య పాత్ర. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య పాత్ర అన్నమాట. ఎన్టీఆర్ సిఎమ్ అయిన తరువాత వరకు బయోపిక్ వుంటుంది. అంటే అందులో యంగ్ బాలయ్య ఎర్లీ స్టేజ్ లో చేసిన సినిమాల ప్రస్తావన వుంటుంది. అందువల్ల ఈ పాత్ర కూడా కీలకమే.
ఈ పాత్రను మోక్షజ్ఞ చేత చేయిస్తే ఎలా వుంటుందీ? అన్న డిస్కషన్లు నడుస్తున్నాయి. అంటే తన తండ్రి పాత్రలో బాలయ్య నటిస్తే, తన తండ్రి పాత్రలో మోక్షజ్ఞ అన్నమాట. మనం సినిమాలో అఖిల్ ఎంట్రీ ఇచ్చినట్లు, నాగేశ్వరరావు పేరుతో నాగ్ నటించినట్లు వుంటుంది.
పైగా తాత బయోపిక్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే, ఆ కిక్కే వేరుగా వుంటుంది. ఎన్టీఆర్ బయోపిక్ కు వచ్చే బజ్ వేరుగా వుంటుంది. అందుకే ఇప్పుడు ఆ దిశగా ఆలోచనలు, డిస్కషన్లు మొదలయినట్లు తెలుస్తోంది.
సరే ఇవి కాక, చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు , వెంకయ్య లాంటి పొలిటికల్ కీలక పాత్రలు వుండనే వుంటాయి.