Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జయసుధ జాకెట్ కొలతలు చెప్పింది ఆయనే

జయసుధ జాకెట్ కొలతలు చెప్పింది ఆయనే

విజయ బాపినీడు. వైవిధ్యానికి మారుపేరు. ఆయన విజన్ భలే గొప్పది. చందమామ పిల్లల పత్రిక అప్రహతిహతంగా సాగుతున్న కాలంలో, బాలమిత్ర మాత్రమే దానికి కాస్త పోటీ అనుకున్న టైమ్ లో బొమ్మరిల్లు అంటూ పిల్లల పత్రికను తెచ్చి సక్సెస్ చేసింది ఆయనే. విజయ మాసపత్రికను యువ మాసపత్రికకు (అది కూడా చందమామ వారిదే) పోటీగా దింపి సక్సెస్ చేసిందీ ఆయనే. వాస్తవానికి ఒకప్పుడు ఆయన కొన్ని బూతు కథల పత్రికలు కూడా నడిపారు చెన్నయ్ కేంద్రంగా అంటారు. కానీ అదంతా విజయ, బొమ్మరిల్లు రాకముందు.

ఆ తరువాత ఆయన నీలిమ అని ఒక మ్యాగజైన్ తెచ్చారు. అసలు దాని సైజ్ నే వేరుగా వుండేది. ఆ తరహా సైజ్ మాగజైన్ మార్కెట్ లో అదే తొలిసారి. ఆ పత్రికకు జనాలను ఆకర్షించడం కోసం అప్పట్లో ఓ పే...ద్ద బ్రాడ్ షీట్ మీద జయసుధ జాకట్ స్కెచ్ వేసి, దాని కొలతలు మార్క్ చేసి, దానిని ఫోల్డ్ చేసి, మ్యాగ్ జైన్ తో ఉచితంగా అందించారు. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ఆలాగే మరి కొందరు తారల జాకెట్ కొలతలు కూడా అందించారు.

గ్యాంగ్ లీడర్ సినిమా ఫంక్షన్ ను పలు కేంద్రాల్లో ఒకేసారి నిర్వహించి, వాటికి అటెండ్ కావడానికి చిరంజీవి కూడా ప్రత్యేకంగా హెలికాప్టర్ వాడారు. అలాంటి పంక్షన్ ఫస్ట్ అండ్ లాస్ట్ అదే అనుకోవాలి. మోహన్ బాబు-చిరంజీవి కాంబినేషన్ లో ఆయన ఆ రోజుల్లో తీసిన మల్టీ స్టారర్ పట్నంవచ్చిన ప్రతివ్రతలు, అందులో రావుగోపాలరావు, నూతన్ ప్రసాద్ ల పాత్రలు ఇప్పటికీ జనాలకు గుర్తే.

అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో వుంది అనే నూతన్ ప్రసాద్ డైలాగు బాగా పాపులర్. ఇలా ఎన్నో వైవిధ్యాలకు రూపకల్పనకు మూలమైన విజయ బాపినీడు మరణం బాధాకరమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?