జెండాపై కపిరాజు..మళ్లీ వెనక్కి వెళ్తోందా..అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. సముద్రఖని దర్శకత్వంలో నాని హీరోగా నిర్మించిన ద్విభాషా చిత్రం ఇది.చాన్నాళ్లుగా ల్యాబ్ లోనే మూలుగుతోంది. ఇప్పటికే తమిళనాట విడుదలై విజయవంతమైన ఫ్లాపుగా మిగిలిపోయింది. తెలుగునాట విడుదలకు ఇప్పటికి అనుకున్న డేట్లు ఇన్నీ అన్నీ కావు. తాజాగా ఈ నెల 8న అని ప్రకటించారు.
అయితే ఇప్పుడు అది కూడా అనుమానంగా వుందని వినికిడి. రన్ రాజా రన్ హిట్ రేంజ్ లో వుండడం, థియేటర్లు అంతగా ఖాళీ లేకపోవడం, ఆ పై వారమే రభస వుండడం వల్ల, సినిమాను వన్ వీక్ లో తీసేయాల్సి రావడం వంటి వ్యవహారాలు జెండాను ఎగరకుండా చేస్తున్నాయని వినికిడి. ఇక రభస రిజల్ట్ చూసి ఆ పైవారమో, మరో వారమో ఆగి రావాలి.