లోకల్ మార్కెట్లో రామ్ చరణ్ ఇప్పుడు తిరుగులేని హీరో. మల్టీస్టారర్ సినిమాపై విడుదల చేసినా, మహేష్‌బాబు సినిమాతో రిలీజ్ చేసినా కానీ అతని సినిమా కలెక్షన్స్ దుమ్ము దులిపింది. అయితే చరణ్ గత మూడు హిట్స్ అయిన ఎవడు, నాయక్, రచ్చ ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం డిజప్పాయింట్ చేశాయి. నాసిరకం మాస్ సినిమాలకి అక్కడ ఆదరణ ఉండదు.
నాయక్‌లో కామెడీ ఉన్నా కానీ ‘సీతమ్మ వాకిట్లో’లాంటి ఫ్యామిలీ సినిమా వేవ్ ముందు నాయక్ అక్కడ నిలబడలేకపోయింది. ఈ చిత్రానికి అక్కడ మూడు కోట్ల గ్రాస్ కూడా రాలేదు. ఫ్లాప్ టాక్‌తో 1 నేనొక్కడినే మిలియన్ డాలర్లు వసూలు చేస్తే ఎవడు అందులో నాలుగో వంతు మాత్రమే తెచ్చుకుంది. ఓవర్సీస్ మార్కెట్లో అయిదారు కోట్లకి పైగా వసూళ్లు రెగ్యులర్‌గా సాధించినట్టయితే ఇక చరణ్‌కి ఏ లోటూ ఉండదు.
అందుకే ఆ మార్కెట్ మీద చరణ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇంతవరకు ఓవర్సీస్ని తేలిగ్గా తీసుకున్న చరణ్ ఇప్పుడు ఆ మార్కెట్‌పై దృష్టి పెడుతున్నాడు. కృష్ణవంశీ సినిమాతో తనకి అక్కడ టైమ్ స్టార్ట్ అవుతుందని చరణ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఫ్యామిలీ సినిమాలకి అక్కడ ఆదరణ బాగుంటుంది కాబట్టి ఇది తనకి బ్రేక్ ఇస్తుందని అనుకుంటున్నాడు. కృష్ణవంశీ సినిమాతో మొదలు పెట్టి ఆ తర్వాత ఇంకొందరు క్లాస్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసి ఓవర్సీస్లో కూడా జెండా పాతాలని చూస్తున్నాడు.