జై లవకుశ: ప్రచారం పార్ట్-2

ఓ వైపు మిక్స్ డ్ రెస్పాన్స్ తో సినిమా నడుస్తోంది. మరోవైపు స్పైడర్ సినిమా నుంచి పోటీ ప్రారంభమైంది. అందుకే జై లవకుశకు మరోసారి గట్టిగా ప్రచారం కల్పించాలని నిర్ణయించుకున్నాడు ఎన్టీఆర్. ఈ మేరకు…

ఓ వైపు మిక్స్ డ్ రెస్పాన్స్ తో సినిమా నడుస్తోంది. మరోవైపు స్పైడర్ సినిమా నుంచి పోటీ ప్రారంభమైంది. అందుకే జై లవకుశకు మరోసారి గట్టిగా ప్రచారం కల్పించాలని నిర్ణయించుకున్నాడు ఎన్టీఆర్. ఈ మేరకు తన విదేశీ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నాడు. దసరా నుంచి జై లవకుశ రెండో విడత ప్రచారం షురూ కాబోతోంది. 

అయితే ఈసారి కూడా ప్రచారంలో కొత్తదనం ఏమీ లేదు. ఎప్పట్లానే ఛానెల్స్ కు ఇవ్వడానికి ఇంటర్వ్యూలు రెడీ చేస్తున్నారు. వాటినే టీవీల్లో వేస్తారు. కుదిరితే ఎన్టీఆర్ ను మరోసారి మీడియా ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు నిర్మాత కల్యాణ్ రామ్. సెకెండ్ ఫేజ్ ప్రమోషన్ లో ఈ రెండు మాత్రమే ఉండబోతున్నాయి. వీటితో టోటల్ గా జై లవకుశ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు.

మరోవైపు జైలవకుశ సినిమాకు సంబంధించి హై క్వాలిటీ పైరసీ ప్రింట్ అప్పుడే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వాట్సాప్ లో క్లిప్పింగ్ లు, ఫేస్ బుక్ లో ఏకంగా ఫుల్ లెంగ్త్ సినిమా నడుస్తోంది. రెండోవారం వసూళ్లపై దీని ప్రభావం పడే ప్రమాదముంది. 

మరోవైపు దసరా తర్వాత యూరోప్ వెళ్లాలని నిర్ణయించాడు ఎన్టీఆర్. కుటుంబ సభ్యులతో పాటు యూరోప్ లోని కొన్ని దేశాల్లో పర్యటించి, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ప్రారంభిస్తాడు.