రంభా, ఊర్వశి అయినా సరే రోజూ వాళ్లతో గడిపితే తెగ బోర్ కొట్టేసి కొత్తగా ఇంట్లో పనికి కుదిరిన పని పిల్లమీద మనసు పోతుందని అనుభవజ్ఞులు చెబుతారు. గత ఇరవై ఏళ్లుగా స్టార్ యాంకర్‌గా కొనసాగుతున్న ఉదయభానుని చూస్తే మాత్రం ఎన్నేళ్లయినా బోర్ కొట్టదు.
ఇదే ప్రశ్న ఆమెని అడిగితే ‘బోర్ కొట్టించకూడదనే జోరు తగ్గించుకున్నా. ఏవో మనసుకు నచ్చిన రెండు ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాను తప్ప వచ్చిన అన్ని ఆఫర్స్‌నీ ఒప్పుకోవడం లేదు.
ఇప్పటి వరకూ అయితే నేను బోర్ కొట్టిస్తున్నాను అన్న కామెంట్స్ అయితే ఎక్కడా వినలేదు. ఎదుటి వాళ్ల ఆనందం కోసం పాకులాడే మనిషిని నేను. అవమానం అయినా, ఆనందమయినా సమానంగా తీసుకుంటాను. నేను ఏనాడు కూడా ఎవ్వరినీ హర్ట్ చేయలేదు. అదే నా విజయ రహస్యం’ అంటుంది సెక్సీ యాంకర్ ఉదయభాను.