కేవలం రజనీకాంత్‌ని చూసి ‘లింగ’ చిత్రంపై కోట్లకి కోట్లు కుమ్మరించిన బయ్యర్లు రోడ్డున పడ్డారు. రోబోతో సమానమైన రేట్లకి బిజినెస్ చేసిన ఈ చిత్రం అందరు బయ్యర్లనీ అగాధాల్లోకి నెట్టేసింది. తమకి నష్ట పరిహారం కావాలంటూ బయ్యర్లు మీడియా ముందుకి వచ్చారు. రజనీకాంత్ కల్పించుకుని కాపాడాలి అంటూ డిమాండ్ చేసారు.
తమ నష్టాలు భర్తీ చేయకపోతే నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు. రజనీకాంత్‌ని బెదిరించడానికో, ఎదిరించడానికో ఇది చేయడం లేదని… ఆయన దృష్టిలో పడడానికి, తమ గోడు వెళ్లబోసుకోవడానికి అవకాశం కల్పించమని అడుగుతున్నామని చెప్పారు. భారీ నష్టం చవి చూసామని, మోసపోయామని లింగ బయ్యర్లు వాపోతున్నారు.
గతంలో ఇలా తన సినిమాలతో నష్టపోయిన వారికి రజనీకాంత్ సాయం చేసారు. లింగ చిత్రంతో నిజంగానే సగానికి పైగా పోగొట్టుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. వారందరికీ రజనీకాంత్ ఏ విధంగా సాయం చేస్తారనేది చూడాలి.