గొంగళిలో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం మంచిది కాదంటారు. అలాగే సినిమా రంగంలో ఉండి శృంగారం ఒలకబోస్తూ కూడా.. అబ్బే నా స్టిల్స్ ఇబ్బందిగా ఉన్నాయి అంటే ఎలా! శృతిహాసన్‌కి సంబంధించి ఓసారి సెక్సీ స్టిల్స్ విషయంలో ఫోటోగ్రాఫర్స్‌తో గొడవ పడిరది ఒకప్పుడు. తనని అసభ్యంగా చిత్రీకరిస్తూ కొన్ని అభ్యంతరకరమైన ఫోటోలను సోషల్ మీడియాల్లో ప్రదర్శించడం పట్ల గుస్సా అయ్యింది.
ఈ గొడవ ముదిరి పాకాన పడుతున్న టైంలో శృతిహాసన్‌ని తన దగ్గరకు పిలిపించుకుని ఆమె తండ్రి కమల్ హాసన్ హిత బోధ చేసాడట. చూడమ్మా నువ్వు హీరోయిన్‌వి. నీ స్టిల్స్‌ని బట్టే సినిమా మీద అంచనాలు పెరుగుతాయి. అలాంటి వాటి గురించి గొడవ పెట్టుకుంటే నీ కెరీర్‌కే కష్టం. నేను కూడా గతంలో పూర్తి నగ్నంగా ఓ సినిమాలో కనపడడానికి సిద్ధమైపోయినప్పుడు నీలాగ ఆలోచించలేదు. నీ స్టిల్స్ గానీ, సినిమాలు గానీ జనంలోకి ఎంతగా వెళ్లిపోతే అంత మంచిది.
ఇలాంటివి నీకిష్టం లేకపోతే సినిమాలు మానేసి పెళ్లి చేస్కో. నీ జోలికి ఎవ్వరూ రారు.. అని చెప్పాక శృతిహాసన్‌కు జ్ఞానోదయం అయ్యి ఫోటోగ్రాఫర్స్‌తో ఫ్రెండ్లీగా ఉంటుందట. కమల్‌హాసన్ కూడా ఈ విషయంలో తండ్రిలాగ కాకుండా ప్రేక్షకుడిలా ఆలోచించడం గొప్ప విషయం.