ఎవరి జీవితం వారిది. ఇంకొకరు వేలెత్తి చూపించడంలో అర్ధం లేదు. నీకు నచ్చనివి ఎదుటి వాళ్లు చేస్తే అది నీకు తప్పుగా అనిపించొచ్చు కానీ అలా ప్రవర్తించే వాళ్లకది ఎంతో తృప్తినిస్తుందని భావించరెందుకు.. అని ప్రశ్నిస్తోంది హిందీ సెక్సీ తార అనుష్క శర్మ.
ప్రస్తుతం ‘పికె’ సినిమా విజయంతో ఎంతో సంతోషంగా ఉన్న అనుష్క శర్మ స్టార్ డస్ట్‌లో కొన్ని నీతి సూత్రాలు బోధిస్తుంది. నేను క్రికెటర్‌తో స్నేహంగా ఉంటున్నానని బోలెడంత రూమర్ క్రియేట్ అయ్యింది. అదే నేను నా పక్కింటి కుర్రాడితో తిరిగితే ఇంత అల్లరి అవుతుందా? లేదు ఆ సంగతి మా రెండు ఇళ్లకే పరిమితం అవుతుంది.
పోనీ నేను కాకుండా విరాట్ కోహ్లీతో ఇంకో స్టార్ తిరిగినా ఇంత అల్లరవుతుంది. కేవలం ఇది నా వల్ల మాత్రమే నని నాకూ తెలుసు. మేం ఆనందిస్తున్నాం. మీరెందుకు ఈర్ష్యపడుతున్నారు చెప్పండి. నేను నీ లవర్ని కాదు కదా! నువ్వు బాధపడడానికి సినిమాల్లో నేను చూపించాల్సింది చూపిస్తున్నాను. నా పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు కామెంట్ చేస్తున్నారు.
అలా నా వెనుక కామెంట్ చేసే వాళ్లంతా పిరికివాళ్లే. మేమిద్దరం స్టేట్స్లో ఉన్నప్పుడు ఫారినర్స్ బొకేలు, చాక్లెట్సు ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు. మరి అలాంటి మంచి అలవాటు మన వాళ్లకెందుకుండదు అని ప్రశ్నిస్తోంది అనుష్క శర్మ.