రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి' విడుదలయ్యాక ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న విషయం విదితమే. కనీ వినీ ఎరుగని రీతిలో సినిమాపై భారీ అంచనాల్ని క్రియేట్ చేశారు. ఆ అంచనాల్ని అందుకోలేక తొలిరోజే 'కబాలి' ప్రపంచ వ్యాప్తంగా చతికిలపడిందనే రిపోర్ట్స్ వచ్చాయి. అయితే, 'కబాలి' మానియాతో ముందే టిక్కెట్లను అమ్మేయడంతో టాక్ కి భిన్నంగా వసూళ్లు వచ్చాయని తమిళ సినీ వర్గాలు అంచనా వేశాయి.
ఇక, 'కబాలి' ఇప్పటికే రూ.400 కోట్ల మార్కును తాకిందంటూ నిర్మాత కలైపులి థాను మీడియాకి లీకులిస్తున్నారు. ఆయన ఈ వివరాల్ని చెప్పాడంటూ నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో రెండువందల కోట్ల రూపాయలు వసూళ్లు కాగా, మిగిలిన రెండువందల కోట్లు అన్ని భాషల శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ తో వచ్చినవంటున్నారు.
తమ సినిమా తొలి మూడు రోజుల్లో రూ. 190 కోట్లు వసూలు చేసిందన్నది థాను చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
రజనీకాంత్ కి ఇండియాలో దాదాపు అన్ని భాషల్లోనూ విపరీతమైన ఫాలోయింగ్ వున్నమాట వాస్తవం. ఓపెనింగ్స్ పరంగా 'కబాలి' నిర్మాత అంచనాలకు మించే తొలి రోజు వసూళ్ళు సాధించి ఉండొచ్చుగాక. కానీ, ఆ తర్వాతి రోజుకి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వీకెండ్ గనుక, 'స్టడీ' వసూళ్ళు వుండొచ్చేమో. కానీ, 400 కోట్ల రూపాయల మార్కు అంటే మాటలు కాదు!
మరి, 'కబాలి' గురించి ప్రచారంలో ఉన్న లెక్కలు నిజమేనా.? ఏమో మరి, రజనీకాంత్ ఎటూ చెన్నైలో ల్యాండ్ అయిపోయాడు గనుక, ఆయన్ను తీసుకుని కలైపులి థాను మీడియా ముందుకొచ్చి చెబితే, నిజమేనని ఒప్పుకోవాల్సిందే.