శ్రీనివాస్ అవసరాల.. కామెడీ చిత్రాల నటుడు. కామెడీనే కాదు, ఎమోషన్స్‌ని కూడా పండించగలడు. దర్శకుడిగానూ సత్తా చాటాడు. ఈ విలక్షణ నటుడు, దర్శకుడికి ఓ కొత్త ఆలోచన వచ్చింది. బాలీవుడ్లో పలు వివాదాల్ని ఎదుర్కొన్న 'హంటర్' సినిమాని తెలుగులోకి తీసుకురావాలనే ఆలోచన రాగానే, 'సై' అనేశాడు.
ఈ సినిమా అంతలా పాపులర్ అవడానికి కారణం అందులోని అడల్ట్ కంటెంటే. ఈ సినిమాలో నటించిన రాధికా ఆప్టే, ఓ సీన్లో కేవలం లో దుస్తులతోనే కన్పిస్తుంది. అఫ్కోర్స్.. బికినీని మించిన వల్గారిటీ ఏముంటుంది.? అనుకుంటే అదేమీ అంత పెద్ద విషయం కాదు. కానీ, దుస్తుల్ని ఆమె విప్పుతున్న తీరు చాలా బోల్డ్‌గా కనిపిస్తుంది. ఇంకా బోల్డ్ సీన్స్ సినిమాలో చాలానే వుంటాయి.
మరి, ఇలాంటి సినిమా అవసరాల శ్రీనివాస్‌కి ఎందుకు నచ్చింది.? అసలు అంతలా అడల్ట్ సినిమాలు చేయాల్సిన అవసరం మన అవసరాల శ్రీనివాస్‌కి ఎందుకొచ్చింది.? అంటే, ఆ సినిమాలోని 'డెప్త్' తనకు బాగా నచ్చిందంటున్నాడు అవసరాల శ్రీనివాస్. నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో నటించనుండడం ఖాయమైపోయిందట. కానీ, అఫీషియల్‌గా ఇంకా ఫార్మాలిటీస్ పూర్తవలేదట. అంటే, ఇంకా ఎక్కడో 'ఈ సినిమాలో నటించడం అవసరమా.?' అన్న సందేహం శ్రీనివాస్ అవసరాలను వెంటాడుతున్నట్టుంది.!
బాలీవుడ్ నుంచి అడల్ట్ కామెడీ చిత్రాలు, అడల్ట్ కంటెంట్ వున్న థ్రిల్లర్ సినిమాల్ని ఇంపోర్ట్ చేసుకోవడమో, లేదంటే వాటిని మక్కీకి మక్కీ కాపీ కొట్టేయడమో చేస్తున్న టాలీవుడ్లో ఇలాంటివి ప్రస్తుతానికి కాస్త వింతగా అన్పించినా, ముందు ముందు అలవాటైపోతాయ్.!