రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి' బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. తొలి రోజే సినిమా ఫలితం తేలిపోయింది. వీకెండ్లో సినిమా పరిస్థితి ఇంకా దారుణంగా వుంది.. ఇవీ 'కబాలి' రిపోర్ట్స్. సినిమాపై క్రియేట్ అయిన హైప్కీ, సినిమా విడుదలయ్యాక పరిస్థితికీ చాలా తేడా. పాలాభిషేకాలు, విమానాల్లో సినిమా చూసేందుకు ప్రయాణాలు, వెండి కాయిన్లూ.. అబ్బో, 'కబాలి' కోసం చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
అప్పుడు 'కొచాడియాన్'కి జరిగింది, ఆ తర్వాత 'లింగా'కి జరిగింది, ఇప్పుడు 'కబాలి'కి జరిగింది, రేప్పొద్దున్న.. జరుగుతూనే వుంటుంది. కానీ, మూడు దెబ్బలతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ షాక్‌కి గురయ్యింది. ఆ ఎఫెక్ట్ తదుపరి సినిమా 'రోబో 2.0'పై ఖచ్చితంగా పడనుంది. ఈ విషయాన్ని ముందే గ్రహించేయాలి శంకర్. ఎందుకంటే, 'రోబో' తర్వాత శంకర్ తీసిన 'ఐ' సినిమా దారుణంగా బాక్సాఫీస్ వద్ద దెబ్బతినేసింది.
సో, ఇప్పుడు శంకర్ ఏం చేయాలి.? ఇంతవరకు తమిళ తెరపై ఏ సినిమా కోసం చేయనంత ఖర్చుని 'రోబో 2.0' కోసం రజనీకాంత్ ప్లాన్ చేసిన మాట వాస్తవం. ఈలోగా 'కబాలి' ఇంత దెబ్బ కొడుతుందని ఆయనా ఊహించలేదు. ఇప్పుడాయన ఆలోచించడానికి కూడా ఏమీ లేదు. కానీ, ఆలోచించాలి. హైప్ క్రియేట్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. కానీ, ఖచ్చితంగా హిట్ కొట్టాలి. గతంలో అయితే శంకర్‌కి తిరుగులేదు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
ఇప్పుడేం చేయాలి.? 'రోబో 2.0' సినిమాని అద్భుతంగా తెరకెక్కించడం కన్నా, ఆ సినిమాపై నమ్మకాల్ని పెంచగలగాలి. అదే సమయంలో, ప్రేక్షకుల పల్స్‌ని తెలుసుకోవాలి. రజనీకాంత్‌కి ఏమీ కాదు, శంకర్‌కే ఇప్పుడు పెద్ద దెబ్బ తగలబోతోంది. మరి, శంకర్ ఏం చేస్తాడో వేచి చూడాల్సిందే.