కబాలి.. ఏడు కోట్ల సెటిల్మెంట్

సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ కబాలికి విడుదల డేట్ అయితే వచ్చింది కానీ కష్టాలు మరింత పెరిగేలా ఉన్నాయి  కబాలిని అంతకు ముందరి రజనీ సినిమాల బాకీలు వెన్నాడుతున్నాయి. అసలు కొనడానికే చాలా…

సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ కబాలికి విడుదల డేట్ అయితే వచ్చింది కానీ కష్టాలు మరింత పెరిగేలా ఉన్నాయి  కబాలిని అంతకు ముందరి రజనీ సినిమాల బాకీలు వెన్నాడుతున్నాయి. అసలు కొనడానికే చాలా మంది జంకారు. అయితే ఇంతలో కొత్త బయ్యర్లు రంగంలోకి దిగి మంచి రేటుకు కొన్నారు. అంతవరకు బాగానే వుంది. 

సినిమా విడుదల ఎప్పుడు అన్నది సంధిగ్ధంలో పడడంతో, బయ్యర్లు చెప్పిన భారీ రేట్లకు కొనడానికి చాలా మంది జంకారు. ఆఖరికి కమీషన్ మీదనో, రిటర్న్ మీదనో, ఇలా ఎక్కడ ఒప్పందం అక్కడ సెట్ చేసుకున్నారు ఏదో విధంగా కిందా మీదా పడి అక్కడ ఆగింది.. దాంతో కబాలి సినిమాకు విడుదల డేట్ మినహా అన్నీఓకే అనుకున్నారు. ఇప్పుడు విడుదల డేట్ వచ్చింది కానీ, కొత్త కష్టం వచ్చినట్లు తెలుస్తోంది. 

ఫైనాన్షియర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీకాంత్ రెడ్డికి రజనీ భార్య నుంచి పాత బాకీ వస్తే కానీ, సినిమా విడుదలకు సహకరించకూడదని డిస్ట్రిబ్యూటర్లు భీష్మించుకున్నట్లు వినికిడి. ఈ మేరకు వారం రోజుల క్రితమే డిస్ట్రిబ్యూటర్లు తీర్మానించేసుకున్నారని తెలుస్తోంది. వాళ్లు చెన్నైకి ఈ వర్తమానం పంపినట్లు, కానీ ఏ సమాధానం రాలేదని తెలుస్తోంది. 

రజనీ భార్య హామీ అగ్రిమెంట్, చెక్ వగైరా లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గకూడదని అంతా ఒక్కటిగా పోరాడాలని అనుకుంటున్నట్లు వినికిడి. ఇక సినిమా విడుదల పది రోజుల్లో వుంది. బయ్యర్లు లేదా పంపిణీదారులు సెటిల్ మెంట్లు చేయాలి. లేదా అడ్వాన్స్ లు కట్టాలి. మరి ఇవన్నీ రజనీ నుంచి వచ్చే సమాధానం మీద ఆధారపడి వుంటాయి. ఏమవుతుందో మరి?