కాదనలేనంత పెద్ద మొత్తం.. బికినీకి నయనతార సై..!

వయసుతో పాటు నయనతార కు డిమాండ్ కూడా పెరుగుతోంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రేమ వ్యవహారాలతో కెరీర్ కొంత కాలం మందగమనంలో పడినా.. ఇప్పుడు మాత్రం నయన యమ డిమాండున్న హీరోయిన్ గా దూసుకోపోతోంది.…

వయసుతో పాటు నయనతార కు డిమాండ్ కూడా పెరుగుతోంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రేమ వ్యవహారాలతో కెరీర్ కొంత కాలం మందగమనంలో పడినా.. ఇప్పుడు మాత్రం నయన యమ డిమాండున్న హీరోయిన్ గా దూసుకోపోతోంది. ప్రత్యేకించి తమిళంలో ఆమె టాప్ ర్యాంక్ ను ఆస్వాధిస్తోంది. అది కూడా ఆమె ప్రధాన పాత్రలో నటించిన హారర్ సినిమా ఒకటి సూపర్ హిట్ కావడంతో నయనతార పారితోషకాన్ని పెంచేసింది.

హీరోల, హీరోయిన్లకు పారితోషకం విషయంలో ఉన్న హద్దులను చెరిపేస్తోంది నయనతార. ప్రస్తుతం నయన నాలుగు కోట్ల రూపాయల వరకూ పారితోషకం పొందుతున్నట్టుగా సమాచారం. మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా కోసం కూడా ఆమె ఆ స్థాయి పారితోషకం పొందనున్నదని తెలుస్తోంది. మరి మామూలుగా నటిస్తే నాలుగు కోట్ల రూపాయలతో సరిపెట్టుకొంటున్న ఈ మలయాళీ భామ..బికినీ కి మాత్రం అదనపు చార్జ్ డిమాండ్ చేస్తోంది.

చాలా సంవత్సరాల క్రితం 'బిల్లా' తమిళ వెర్షన్ లో బికినీతో హీటెక్కించిన నయన ఇప్పుడు మరో తమిళ సినిమాలో కూడా బికినీలో దర్శనమివ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  కాదనలేంత పెద్ద మొత్తాన్ని ఎరగా వేయడంతో నయనతార బికినీతో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ కాదనలేనంత పెద్ద మొత్తం.. ఆమె నాలుగు కోట్ల పారితోషకానికి అదనం అని తెలుస్తోంది. మొత్తానికి తనకున్న డిమాండ్ ను చక్కగా క్యాష్ చేసుకొంటోంది నయనతార!