ఆయన ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో. టాప్ హీరోలజాబితాలో తొలి స్థానాల్లో ఉన్న ఘనత అతడిది. అంతే కాదు.. ఎన్నో వివాదాల్లోకూడా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యం. జైలుకు కూడా వెళ్లిన నేపథ్యం ఉన్న ఈ హీరోగారు కొంత కాలం కిందట అంతే వివాదాస్పద రీతిలో ఒక కేసు నుంచి క్లీన్ చిట్ తెచ్చుకున్నాడు. ఈ హీరోగారి కేసు విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల అనేక మంది ఆశ్చర్యపోయారు కూడా. అయినా కూడా విచిత్రం ఏమిటంటే.. ఇప్పటికే ఈ హీరోపై అభిమానాన్ని, జాలిని చూపించే వాళ్లు ఎంతో మంది ఉండటం!
ఇతడు మంచోడంటూ అభిమానించే సాధారణ ప్రేకకుల సంగతిని పక్కనపెడితే.. ఇతడి చేతిలో బాధిత హీరోయిన్లు మాత్రం చాలా మందే ఉన్నారు. ప్రత్యే్కించి బాలీవుడ్ లో హీరోయిన్ల మనుగడకు ఇతడి ఆశీస్సులు ఎంతో ముఖ్యం కూడా. ఆ ఆశీస్సుల కోసం స్వయంగా ఇతడికి దగ్గయ్యే వారూ చాలా మందే ఉన్నారు. మరి వారి సంగతి కాకుండా.. తనకు లొంగని హీరోయిన్లను ఈ హీరోగారు లోబరుచుకోవడం కోసం బలప్రయోగాన్నే చేసే సందర్భాలకు కొదవేమీ లేదు.
ముంబై మాఫియాతో రహస్య సంబంధబాంధవ్యాలను పుష్కలంగా కలిగిన ఈ హీరోగారు ఒక హీరోయిన్ విషయంలో ఇలాంటి బలప్రయోగాన్నే చేశాడు. సూటిగా ఈ హీరోగారే రంగంలోకి దిగినా..ఆమె లొంగకపోయే సరికి ఆమెను రకరకాలుగా బెదిరించి.. ఆఖరికి చంపేస్తాం అని హెచ్చరించి మరీ లోబరుచుకున్నాడు ఈ హీరో. ఆమె ఈ హీరోతో కలిసి నటించింది కూడా. అయినా కూడా ఇతడి క్రూర రూపంపై మారు మాట్లాడలేని పరిస్థితి. ఇటీవలే రహస్యంగా వివాహం చేసుకున్న ఆ హీరోయిన్ ఈ వ్యవహారం గురించి మీడియా పరిశోధించబోయినా.. ఆగ్రహావేశాలే వ్యక్తం చేస్తుంది. ఈ విషయంలో ఆమె పరిస్థితినీ అర్థం చేసుకోవచ్చు!