కోవిడ్ -19 లాక్ డౌన్లకు పూర్వమే కాజల్ అగర్వాల్ ఎంగేజ్ మెంట్ జరిగిందట, ఆ ఎంగేజ్ మెంట్ కు ఆమె 'సీత' సహనటుడు బెల్లంకొండ సాయి కూడా హాజరయ్యాడట. కాజల్ కు బోలెడంత మంది సహనటీనటులున్నా వారెవరినీ కూడా ఆ కార్యక్రమానికి పిలవలేదట. చాలా సింపుల్, గుంభనంగా కాజల్ ఎంగేజ్ మెంట్ జరిగిందనే వార్తలు ఇప్పుడు వస్తున్నాయి.
ముంబైకి చెందిన గౌతమ్ కిచ్లూతో ఆమె కొన్నాళ్లుగా ప్రేమలో ఉందని, ఎంగేజ్ మెంట్ జరిగిందని, త్వరలోనే పెళ్లి అని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై కాజల్ అధికారికంగా స్పందించలేదు. కొన్నాళ్ల కిందట డెస్టినేషన్ ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఆమె అప్పుడు కూడా పుకార్లకు ఊతం ఇచ్చింది కానీ, అసలు విషయాన్ని ప్రకటించలేదు!
హీరోయిన్లు అలా తమ వ్యక్తిగత ప్రేమ, పెళ్లి వ్యవహారాలను కాస్త రహస్యంగానే ఉంచడం సహజమే. అయితే రోజులు మారాయి. అలాంటి రహస్య వ్యవహరాలు పాతకాలం. ఈ తరం హీరోయిన్లలో 20 యేళ్లలోపు వారు కూడా తమ ప్రేమ వ్యవహారాలను మరీ రహస్యంగా ఉంచడటం లేదు.
ఒకవైపు కెరీర్ ను చూసుకుంటూనే మరోవైపు రొమాంటిక్ లైఫ్ ను మిస్ కావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో 35 యేళ్ల కాజల్ ఇలా తన ప్రేమ, ఎంగేజ్ మెంట్ విషయాలను మాత్రం దాచి పెట్టినట్టుగా వ్యవహరిస్తుండటం కాస్త విశేషమే! మరీ అలా దాచుకునే వయసు కాదేమో అది!