కాజల్‌కి బుద్ధొచ్చింది

గత ఏడాది నాయక్‌, బాద్‌షా చిత్రాలతో వరుస విజయాలు సాధించిన కాజల్‌ మంచి జోరు మీద ఉండగా తెలుగు చిత్ర పరిశ్రమకి దూరమైంది. తన సక్సెస్‌తో సమానంగా తన పే చెక్‌ కూడా ఉండాలని…

గత ఏడాది నాయక్‌, బాద్‌షా చిత్రాలతో వరుస విజయాలు సాధించిన కాజల్‌ మంచి జోరు మీద ఉండగా తెలుగు చిత్ర పరిశ్రమకి దూరమైంది. తన సక్సెస్‌తో సమానంగా తన పే చెక్‌ కూడా ఉండాలని చాలా ఎక్కువ పారితోషికం డిమాండ్‌ చేసిందని, దాంతో పలు చిత్రాల నుంచి ఆమెని తొలగించారని వార్తలొచ్చాయి. అయితే తెలుగు సినిమాల్లో అవకాశాలు రాకపోయినా తనకి తమిళ చిత్రాలున్నాయని కాజల్‌ తల ఎగరేసింది. 

అయితే ఆల్‌ ఇన్‌ ఆల్‌ అళగురాజా, జిల్లా ఫలితాల తర్వాత కాజల్‌కి కోలీవుడ్‌లో డిమాండ్‌ తగ్గింది. తమన్నా, సమంత అక్కడికి కూడా తిరిగి రావడంతో కాజల్‌కి తమిళంలో అవకాశాలు తగ్గాయి. దాంతో పరుగెత్తుకుంటూ మళ్లీ తెలుగు సినిమాలు చేస్తానని ఇక్కడికి వచ్చేసింది. చరణ్‌, కృష్ణవంశీ సినిమాలో వచ్చిన అవకాశాన్ని మారు మాట్లాడకుండా ఓకే చేసింది. 

పైగా తెలుగు సినిమా పరిశ్రమని ఎప్పటికీ విడిచిపెట్టనని, తాను ఇవాళ ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు తెలుగు సినిమాలే కారణమని చెప్తోంది. పరభాషల్లో ఒకటి రెండు అవకాశాలు రాగానే మూలాలు మర్చిపోయి పొగరు చూపిస్తున్న తారలు కాజల్‌ని చూసి పాఠం నేర్చుకోవాలి. మంచి పొజిషన్‌లో ఉండగా పక్కదారి పట్టడం కంటే ఉన్నచోటే మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నించాలి.