పవన్‌తో ఈ పిల్లా?

పవన్‌కళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌ 2’ చిత్రం ఎప్పుడు మొదలయ్యేది, ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటించేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఎందుకో ఈ చిత్రం విషయంలో పవన్‌కళ్యాణ్‌ తాపీగా వ్యవహరిస్తున్నాడు. గత ఏడాది ఆగస్ట్‌ నుంచి ఖాళీగానే…

పవన్‌కళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌ 2’ చిత్రం ఎప్పుడు మొదలయ్యేది, ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటించేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఎందుకో ఈ చిత్రం విషయంలో పవన్‌కళ్యాణ్‌ తాపీగా వ్యవహరిస్తున్నాడు. గత ఏడాది ఆగస్ట్‌ నుంచి ఖాళీగానే ఉన్నా కానీ పవన్‌ ఈ సినిమా పనులు వేగవంతం చేయడం లేదు. మార్చి నెలాఖరులోగా ఈ చిత్రం షూటింగ్‌ మొదలవుతుందని అంటున్నారు. 

ఇదిలావుంటే ఈ చిత్రంలో పవన్‌ సరసన నటించేది ఎవరు? ఇప్పటికే చాలా మంది పేర్లు విన్నాం. వాణీ కపూర్‌ అని, కాజల్‌ అగర్వాల్‌ అని తరచుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కొత్తగా ఇప్పుడు మిస్‌ ఇండియా-ఎర్త్‌ ధూలిపాళ శోభితకి గబ్బర్‌సింగ్‌ 2లో నటించే అవకాశం దక్కవచ్చునని ప్రచారం జరుగుతోంది. 

తెనాలికి చెందిన శోభిత కింగ్‌ఫిషర్‌ మోడల్‌గానూ చేసింది. సినీ రంగంలో అడుగు పెట్టాలని తనవంతుగా ప్రయత్నాలు కూడా చేస్తోంది. కొత్త హీరోయిన్లు పలువురిని పరిశీలించిన నేపథ్యంలో ఈమె కూడా కన్సిడరేషన్‌కి వచ్చిందా? లేక నిజంగా ఈ ప్రాజెక్ట్‌కి ఫ్రంట్‌ రన్నర్స్‌లో ఉందా? ఒకవేళ ఉంటే ఈమె పవన్‌ సరసన బాగుంటుందా?