కాజల్ లాగే ఎవరైనా హీరో మాట్లాడి ఉంటే..!

చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అంటూ.. స్టేట్ మెంట్ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఇది ఆమె వ్యక్తిగతం. తను పెళ్లి చేసుకునే వ్యక్తి ఎలాంటి పనిచేయాలి, ఎలాంటి పని చేయకూడదు, ఏ రంగంలో…

చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అంటూ.. స్టేట్ మెంట్ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఇది ఆమె వ్యక్తిగతం. తను పెళ్లి చేసుకునే వ్యక్తి ఎలాంటి పనిచేయాలి, ఎలాంటి పని చేయకూడదు, ఏ రంగంలో పని  చేయాలి.. అనే విషయాలు ఎవరికైనా వ్యక్తిగతమే. అయితే కాజల్ లాగా ఇండస్ట్రీకే చెందిన హీరో ఎవరైనా మాట్లాడి ఉంటే మాత్రం అదో పెద్ద వార్తే అయ్యేది. గతంలో ఇలాగే జరిగింది కూడా.

తమిళ హీరో జై మంచి ఫామ్ లో ఉన్న రోజుల్లో పెళ్లి గురించి మీడియా వర్గాలు ఆరాతీశాయి. ఆ సందర్భంలో అతడు తను అచ్చం కాజల్ లానే మాట్లాడాడు. తను ఇండస్ట్రీలోని అమ్మాయిని పెళ్లి చేసుకోనని ఆ హీరో ప్రకటించాడు. ఏ హీరోయిన్ నీ పెళ్లాడటం ఉండదని.. అతడు ప్రకటించాడు.

ఇంకేముంది.. అనేకమంది హీరోయిన్లు అతడిపై విరుచుకుపడ్డారు. హీరోయిన్లు మ్యారేజ్ మెటీరియల్స్ కాదా? అంటూ జై పై వాళ్లు విరుచుకుపడ్డారు. హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటే తన ఇంట్లో వాళ్లు ఒప్పుకోరన్నట్టుగా జై మాట్లాడే సరికి.. చివరకు అతడు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

హీరోయిన్లంటే తనకు చిన్నచూపు ఏమీలేదని.. వేరే కారణాలతో హీరోయిన్లను పెళ్లి చేసుకోనని అనాల్సి వచ్చిందని ఆ హీరో వివరణ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు కాజల్ బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చింది. తను చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకోనని ఈమె తేల్చిచెప్పింది. హీరోయిన్లు ఇలా మాట్లాడితే అభ్యంతర పెట్టేవాళ్లు ఎవ్వరూ ఉండరు కదా!

తలసానిని కలిస్తే సస్పెండా? మరి పరిటాల పెళ్ళిలో సెల్ఫీలు దిగారే

ఇండియన్ యూత్.. సెక్స్ కన్నా స్మార్ట్ ఫోనే ఇష్టం!