మన సినిమా ఫంక్షన్లకు ఓ ఎజెండా అంటూ వుండదు. వచ్చిన సెలబ్రిటీలకు అనుగుణంగా అప్పటికప్పుడు మారిపోతుంటుంది వ్యవహారం. కానీ తమిళ సినిమా జనాల సంగతి వేరు. వాళ్ల ఇక్కడికి వచ్చి ఫంక్షన్లు చేసేటపుడు వాళ్ల స్టయిల్ లో వాళ్లు వెళ్లిపోతారు. కానీ ఇక్కడ ఆ సినిమాకు సంబంధించిన వారు ఇరుకున పడతారు.
నిన్నటికి నిన్న ఉత్తమ విలన్ అడియో ఫంక్షన్ లో ఇలాగే జరిగింది. అసలే కమల్ హాసన్. సీతయ్య టైపు వ్యవహారం. ఫంక్షన్ కు వచ్చిన టాలీవుడ్ పెద్దలను ఎవరినీ స్టేజ్ మీదకు పెద్దగా పిలవలేదట. అయితే అక్కడే టీ సుబ్బరామి రెడ్డి వున్నారు.
ఆఖరికి నిర్మాత కళ్యాణ్ స్యయంగా కలుగచేసుకుని, కమల్ కు చెప్పి, నచ్చచెప్పి, పిలవకతప్పదని ఒప్పించి, కళాబంధును స్టేజ్ పైకి రప్పించారట.