కళ్ళు తెరిపించిన వర్మ

‘కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు’ సినిమా చేయడం తనకి జ్ఞాన నేత్రం తెరిపించిందని స్వాతి అంటోంది. ఆ చిత్రానికి ముందు తనకి విజయం విలువ ఏంటనేది తెలియలేదని, యాంకర్‌గా సక్సెస్‌ అయిపోయి… తర్వాత సినీ…

‘కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు’ సినిమా చేయడం తనకి జ్ఞాన నేత్రం తెరిపించిందని స్వాతి అంటోంది. ఆ చిత్రానికి ముందు తనకి విజయం విలువ ఏంటనేది తెలియలేదని, యాంకర్‌గా సక్సెస్‌ అయిపోయి… తర్వాత సినీ రంగంలో కూడా విజయవంతమయ్యానని, దాని వేల్యూ ఏంటనేది అప్పల్రాజుతోనే తెలిసిందని చెప్పింది. 

ఈ చిత్రం చేయక ముందు తను ఈ రంగానికి ఎందుకు వచ్చిందీ, ఏం చేస్తున్నదీ తెలిసేది కాదని… కానీ అప్పల్రాజు చేసిన తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలో, ఎలాంటివి చేస్తే మనుగడ ఉంటుందో తెలిసొచ్చిందని అంటోంది. స్వాతికే కాదు… ఆ సినిమా సునీల్‌కి కూడా పెద్ద దెబ్బే వేసింది. మర్యాద రామన్న తర్వాత తనని ఇమ్మీడియట్‌గా నేల మీదకి తీసుకొచ్చేసింది. 

వర్మ తీస్తున్న సినిమాల వల్ల చూసే జనాలకి, కొన్న వారికి తల నొప్పి, నష్టాలు తప్ప ఏం మిగలట్లేదు. కనీసం వాటిలో నటిస్తున్న వారికి అయినా అవి ఏదో విధంగా పనికి రావడం గొప్ప విషయమే. ఇంకా ఎందుకు సినిమాలు తీస్తున్నట్టు వర్మా అని అడిగితే… స్వాతిలాంటి వాళ్లని చూపించి గర్వ పడొచ్చు.