Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కళ్యాణ్ రామ్ కు రెండు లుక్స్

కళ్యాణ్ రామ్ కు రెండు లుక్స్

పూరి జగన్నాధ్ డైరక్షన్లో తొలిసారి నటిస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఈ సినిమాకు ఇజమ్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్‌రామ్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో పవర్‌ఫుల్‌ మూవీ 'ఇజం'  ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేస్తూ సెప్టెంబర్ 29న విడుదలచేస్తున్నట్లు డేట్ కూడా ప్రకటించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక లుక్ కాదు..రెండు లుక్స్ లో కనిపిస్తారన్నది ఎక్స్ క్లూజివ్ న్యూస్. ఓ పాత్ర స్టయిలిష్ రగడ్ లుక్ లో వుంటే, మరో పాత్ర స్టయిలిష్ క్లాస్ లుక్ లో వుంటుందట. 

డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఈరోజు 'ఇజం' టైటిల్‌ను ఎనౌన్స్‌ చేసి, ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్‌లో రిలీజ్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. ఆగస్ట్‌ 9 నుంచి నెలాఖరు వరకు స్పెయిన్‌లో భారీ షెడ్యూల్‌ జరుగుతుంది. సెప్టెంబర్‌ 29న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 

నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌, ఎడిటింగ్‌: జునైద్‌, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: జానీ,  నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?