చంద్రబాబుకి జగన్‌ ఫోబియా.!

చంద్రబాబుకి జగన్‌ ఫోబియా పట్టుకుంది.. ఏ స్థాయిలో అంటే, జగన్‌ పేరు ఉచ్ఛరించకుండా ఆయన ఏ పనీ చేయలేనంతగా. మీడియా ముందుకొస్తే, చంద్రబాబు ఒకటికి పదిసార్లు జగన్‌ భజన చెయ్యాల్సిందే. జగన్‌ విమర్శించడానికైనా సరే,…

చంద్రబాబుకి జగన్‌ ఫోబియా పట్టుకుంది.. ఏ స్థాయిలో అంటే, జగన్‌ పేరు ఉచ్ఛరించకుండా ఆయన ఏ పనీ చేయలేనంతగా. మీడియా ముందుకొస్తే, చంద్రబాబు ఒకటికి పదిసార్లు జగన్‌ భజన చెయ్యాల్సిందే. జగన్‌ విమర్శించడానికైనా సరే, జగన్‌ భజన చేయకుండా చంద్రబాబు ఏ ప్రెస్‌మీట్‌ కూడా ముగించరు. ఒక్క మాటలో చెప్పాలంటే, జగన్‌ పేరు తలవకుండా చంద్రబాబుకి రోజు తెల్లారదనడం అతిశయోక్తి కాకపోవచ్చు. 

దేశంలో చాలామంది రాజకీయ నాయకులున్నారు. చాలా రాజకీయ పార్టీలున్నారు. ఓసారి కాంగ్రెస్‌, ఇంకోసారి బీజేపీ.. ఇలా అధికారం చేపడుతూ వస్తున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలో వున్నప్పుడు బీజేపీని విమర్శించడం, బీజేపీ అధికారంలో వున్నప్పుడు కాంగ్రెస్‌ విమర్శించడం మామూలే. వ్యక్తిగతంగా దేశ రాజకీయాల్లో విమర్శలు చేసుకోవడమూ సహజమే. అలాగని, అదే పనిగా వ్యక్తిగత విమర్శలతో అధికారంలో వున్నవారు సరిపెట్టడం అనేది చాలా చాలా చాలా అరుదు. 

ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, అన్ని సందర్భాల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌నో, ఇంకో పార్టీనో విమర్శించదు. విపక్షాల విమర్శలకు టీఆర్‌ఎస్‌ సమాధానం ఇస్తుంటుంది. పార్టీ శ్రేణులు విమర్శలు చేయడం తప్పేమీ కాదు, కానీ ముఖ్యమంత్రి పదే పదే అదే పనిచేస్తేనే వినేవారికీ చిరాకు పుట్టుకొస్తుంది. చాలా సందర్భాల్లో కేసీఆర్‌, విపక్షాలు చేసే విమర్శల్ని లైట్‌ తీసుకుంటారు.. అదే సమయంలో, విపక్షాలపై విమర్శలు చేయడానికీ అంతగా ఆసక్తి చూపరు. 

మరి, చంద్రబాబెందుకు జగన్‌ పేరు తలవకుండా రోజు గడపరు.? ఇదే ఇప్పుడు అందర్నీ వేధిస్తోన్న ప్రశ్న. జగన్‌, చంద్రబాబుని ప్రశ్నించకపోతే తప్పు. ఎందుకంటే, జగన్‌ వున్నది ప్రతిపక్షంలో. చంద్రబాబు చెప్పాలనుకుంటే జగన్‌కి సమాధానం చెప్పొచ్చు, లేదంటే లైట్‌ తీసుకోవచ్చు. అది ఆయన విజ్ఞత మీద ఆధారపడి వుంటుంది. అమరావతి భూ కుంభకోణంలో అయినా, అంతకు ముందు కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ వివాదంలో అయినా.. జగన్‌ విమర్శల్ని చంద్రబాబు పట్టించుకోలేదు. ఎదురుదాడితో సరిపెట్టారు. 

తాజాగా, విజయవాడలో దేవాలయాల తొలగింపు వివాదాస్పదమయ్యింది. విపక్షాలు భగ్గుమన్నాయి. మిత్రపక్షమే ప్రభుత్వాన్ని నిలదీశాక, విపక్షాల విమర్శల్ని ఎలా తప్పుపట్టగలం.? ఇంకేముంది, చంద్రబాబుకి ఆగ్రహావేశాలు పుట్టుకొచ్చేశాయి. విపక్షాలు విధ్వేషాల్ని రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ చంద్రబాబు పరోక్షంగా జగన్‌ మీద విరుచుకుపడ్డారు. ఈ వివాదంలో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా మారింది బీజేపీనే. ఆ పార్టీకి చెందిన నేతలకేమో, సున్నితంగా క్లాస్‌ తీసుకున్నారు చంద్రబాబు. 'ఏదన్నా వుంటే నాతో మాట్లాడండి.. మీలో మీరు విమర్శలు చేసుకోవద్దు..' అంటూ బీజేపీకి క్లాస్‌ పీకుతూ, టీడీపీ నేతల్ని హెచ్చరించారాయన. 

కులాల కుంపట్లను రగిల్చిందెవరు.? కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తామని మాట తప్పిందెవరు.? చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ముద్రగడ పద్మనాభం ప్రశ్నిస్తున్నారు. దానికి ఓ పార్టీగా కాంగ్రెస్‌ ఎలాగైతే మద్దతిచ్చిందో, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా అంతే. రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పొచ్చు, మాట తప్పేశాం.. రిజర్వేషన్లను ఇవ్వబోం.. అని చెప్పేయొచ్చు. ఇవన్నీ కాదని, మధ్యలో జగన్‌ పేరు తెరపైకి తెచ్చి చంద్రబాబు కామెడీ చేస్తారు. ఇంతకన్నా చంద్రబాబుకి జగన్‌ ఫోబియా వుందని చెప్పడానికి నిదర్శనం ఇంకేం కావాలి.? 

విజయవాడలో ఆలయాల కూల్చివేత తప్పేనని సాక్షాత్తూ ప్రభుత్వం ఒప్పుకున్నాక, ఆ తప్పుని ప్రశ్నించిన బీజేపీది తప్పు కాదంటూ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనీ, జగన్‌నీ విమర్శించాలని చంద్రబాబుకి ఎలా అన్పించిందో ఏమో.!