Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రవితేజకు నిర్మాతలు కరువా?

రవితేజకు నిర్మాతలు కరువా?

బెంగాల్ టైగర్ లాంటి హిట్ ఇచ్చిన తరువాత కూడా హీరో రవితేజ సినిమా ఇంతవరకు స్టార్ట్ కాలేదు. దిల్ రాజుతో సినిమా అనుకున్నారు..కాలేదు..అదే సినిమా రంజిత్ మూవీస్ అనుకున్నారు..అవలేదు. కాదు కాదు, దానయ్య అన్నారు. ఇప్పుడు అదీ అలాగే వుంది. రవితేజ తను పట్టుకున్న సబ్జెక్ట్, తను అనుకున్న డైరక్టర్, తను ఫిక్స్ చేసుకున్న పారితోషికం అని పట్టుబట్టి కూర్చొవడం వల్లనే ప్రాజెక్టు లేట్ అవుతోందని ఇండస్ట్రీ టాక్. 

రవితేజతో సినిమా అంటే 15లో ఫినిష్ చేసి ఇరవై రేంజ్ లో అమ్ముకుంటే సేఫ్. కానీ రవితేజ మార్కు మాస్ మసాలా సినిమా, హీరోయిన్లు, అన్నీ కలిసి ఇరవై దాటేస్తోంది లెక్క. అందుకే నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారని వినికిడి. ఇరవై దాటితే సినిమా ఏ రేంజ్ లో అమ్మకాలు సాగించాలి..షేర్లు సాధించాలి అన్నది లెక్క. అందుకే ప్రాజెక్టు డిలే అవుతోందని వినికిడి. 

ఈలోగా కాంబినేషన్ క్రేజీగా వుంటుందని పవర్ డైరక్టర్ బాబీని తెరపైకి తెచ్చారు రవితేజ అని టాక్ వినిపిస్తోంది. పవర్ తో హిట్ కొట్టి, పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ తో డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు బాబీ. అందుకే  తను తీసుకువచ్చిన డైరక్టర్ ను తనే ఆదుకోవాలని అనుకుంటున్నారట రవితేజ. సో, రెండు ప్రాజెక్టులను ఆప్షన్స్ గా చూపిస్తూ, నిర్మాతల కోసం చూస్తున్నారు రవితేజ అని వార్తలు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?