Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కళ్యాణ్ రామ్ సినిమాకు 26 కోట్లా?

కళ్యాణ్ రామ్ సినిమాకు 26 కోట్లా?

తలకు తగ్గ తలపాగా అని సామెత. హీరోలు వాళ్ల రేంజ్ తెలుసుకుని, సినిమా నిర్మాణానికి ఖర్చు చేయడమో, చేయించడమో చేయాలి. కళ్యాణ్ రామ్ పటాస్ నే పెద్ద హిట్. దానినే 20 కోట్ల రేంజ్ లో విక్రయాలు జరిపారు. ఇప్పుడు తాజాగా కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమాకు 26 కోట్లు ఖర్చు చేసేసారట. పూరి జగన్నాధ్ దర్శకుడు. ఆయనే ఏడెనిమిది కోట్లు తీసుకుంటారు. దాంతో సినిమా ఖర్చు 26 కోట్లకు డేకేసినట్లు తెలుస్తోంది. 

దీంతో దానికి తగ్గట్టే రేట్లు చెబుతున్నారట. పూరి ట్రాక్ రికార్డు తెలిసి, కళ్యాణ్ రామ్ రేంజ్ తెలిసి, బయ్యర్లు, అటు చూడడం లేదట. పూరి కాస్త బడ్జెట్ కంట్రోల్ లో వెళ్లి వుంటే ఈ పరిస్థితి వచ్చి వుండేది కాదు. కానీ ఆయన బడా హీరోల భారీ సినిమా మాదిరిగా తీసేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఈ సినిమాను అక్టోబర్ 7న బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

అంటే మళ్లీ మరోసారి అన్న కోసం ఎన్టీఆర్ మాట సాయమో, చేతి సాయమో చేయాల్సి వచ్చేలా వుంది. ఇజం తరువాత అదే బ్యానర్ లో ఎన్టీఆర్ సినిమా అన్నది కన్ ఫర్మ్. ఆ విషయాన్ని, ప్రాజెక్టు డిటైల్స్ ను ఈ నెలలో కచ్చితంగా ప్రకటిస్తే తప్ప, ఇజం మార్కెటింగ్ సమస్య గట్టెక్కదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?