Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కళ్యాణ్‌రామ్‌.. ఇది అదేనా.?

కళ్యాణ్‌రామ్‌.. ఇది అదేనా.?

ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్‌రామ్‌ కొద్ది రోజుల క్రితం 'బ్రదర్స్‌' అనే టైటిల్‌ని రిజిస్టర్‌ చేయించాడు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన 'ఇజం' సినిమా విడుదలకు ముందు జరిగిన విషయమిది. ఆ సమయంలోనే, తన సోదరుడు ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని వుందనీ, అతనితో సినిమా నిర్మించాలని వుందనీ, రెండు కోరికలూ ఒకేసారి తీరతాయేమోనని హింట్‌ ఇచ్చేశాడు కళ్యాణ్‌రామ్‌. 

కానీ, కొన్ని కారణాలతో కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌తో సినిమాని కాస్త ఆలస్యంగా అనౌన్స్‌ చేశాడు. ఎన్టీఆర్‌తో సినిమా నిర్మిస్తున్నట్లు కళ్యాణ్‌రామ్‌ తాజాగా ప్రకటించడంతో, ఒక్కసారిగా అందరి ఆలోచనలూ 'బ్రదర్స్‌' టైటిల్‌ మీదకు వెళ్ళాయి. 'అదుర్స్‌' తరహాలో ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ని, బాబీ దర్శకత్వంలో చేయాలన్నది ఎన్టీఆర్‌ ఆలోచన. 'అదుర్స్‌' పేరులానే 'బ్రదర్స్‌' పేరు కూడా సింక్‌ అవుతున్నా, ఎన్టీఆర్‌ ఈ టైటిల్‌ విషయంలో ఏమంటాడన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. 

మరోపక్క, 'బ్రదర్స్‌' అనే టైటిల్‌ కళ్యాణ్‌రామ్‌ తనకోసం రిజిస్టర్‌ చేయించుకున్నాడనీ, బాబీ - ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో అనుకోకుండా కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా సినిమా ఫైనల్‌ అయ్యిందనీ ఇంకో వాదన విన్పిస్తోంది. ఏం, ఎన్టీఆర్‌ అడిగితే 'బ్రదర్స్‌' టైటిల్‌ని కళ్యాణ్‌రామ్‌ కాదంటాడా.? ఛాన్సే లేదు. 

ఏదిఏమైనా, నందమూరి బ్రదర్స్‌ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా, ఎన్టీఆర్‌ హీరోగా.. ఇక్కడివరకూ క్లారిటీ వచ్చింది. మరి, సోదరుడితో కలిసి నటించాలన్న కోరికను ఈ సినిమాతో కళ్యాణ్‌రామ్‌ తీర్చుకుంటాడా.? వేచి చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?