ఎంత హీరో అయినా, ఎంత పెద్ద సినిమా అయినా పబ్లిసిటీ లేనిదే కష్టం అని అందరికీ అర్థమైపోయింది. మీడియాతో ఎంత విచ్చల విడిగా మాట్లాడితే అంత బెటర్ అని ఇప్పుడు టాలీవుడ్ జనాలు అందరికీ తెలిసి వచ్చింది. మొన్నటికి మొన్న శ్రీమంతుడు సినిమాకు మహేష్ బాబు చేసింది అదే. నిన్నటికి నిన్న చిన్న సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కు చేసింది ఇదే. ఇప్పుడు ఇదే సంగతి విఖ్యాత నటుడు కమల్ హాసన్ కు తెలిసింది.
తను చాలా కాలం తరువాత తెలుగులో చేస్తున్న చీకటి రాజ్యం ప్రమోషన్ కు ఆయన పూర్తి సమయం కేటాయించారు. ఒకప్పుడు కమల్ ఇంటర్వూ అంటే మహా కష్టం. ఇప్పుడు అడగనివారిది పాపం. గడచిన ఒకటి రెండు రోజుల్ల తెలుగు మాధ్యమానికి కమల్ ఇచ్చిన ఇంటర్వూల సంఖ్య 22. అది కూడా ఇంకా వెబ్ మీడియా దాకా రాలేదు. దానికి వేరే షెడ్యూలు రెడీ చేస్తున్నారు.
ఇటు ప్రింట్..అటు విజువల్..మరోపక్క వెబ్ అన్నీ కలుపుకుంటే, హాఫ్ సెంచరీ దాటేస్తాయి ఇంటర్వూలు. ఇలా చేయాలంటే చాలా ఓపిక వుండాలి. అలా ఓపిక వుంటనే ఇవ్వాళ సినిమాలకు ఓపెనింగ్స్ వస్తున్నాయి మరి.