దసరా నాడు ‘మైత్రీ’ పూజ

ఈ దసరాకు మైత్రీ మూవీస్ రెండో సినిమాకు పూజ కార్యక్రమం ఫిక్సయింది. అయితే ఇది సింపుల్ గా కానిచ్చేస్తారా? లేక హడావుడి వుంటుందా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. ప్రస్తుతానికి కొరటాల శివ అమెరికా…

ఈ దసరాకు మైత్రీ మూవీస్ రెండో సినిమాకు పూజ కార్యక్రమం ఫిక్సయింది. అయితే ఇది సింపుల్ గా కానిచ్చేస్తారా? లేక హడావుడి వుంటుందా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. ప్రస్తుతానికి కొరటాల శివ అమెరికా వెళ్తున్నారు. ఆయన తిరిగి 15న వస్తారు. అప్పుడు ఈ విషయం డిసైడ్ చేస్తారు. 

మైత్రీ మూవీస్-ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో సినిమాకు జస్ట్ దసరా నాడు పూజ మాత్రమే చేస్తారు. నాన్నకు ప్రేమతో సినిమా దాదాపు పూర్తి అయిన తరువాత ఇది సెట్ మీదకు వెళ్తుంది. పైగా దీని స్టార్ కాస్ట్ ఇతరత్రా వ్యవహారాలు అన్నీ ఏమీ డిసైడ్ కాలేదు. అయితే టెక్నీషియన్లు మాత్రం చాలా మంది శ్రీమంతుడుకి పని చేసిన వారే వుంటారని వినికిడి. కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ కూడా చేయాల్సి వుంది.

అందువల్ల నామినల్ గా మంచి రోజు పూజ కానిచ్చి, మరో రెండు నెలల తరువాత సెట్ మీదకు వెళ్లాలన్నది ప్లాన్.