కమల్‌హాసన్‌కి ఏమయ్యింది.?

సినీ నటుడు కమల్‌హాసన్‌ ఆసుపత్రిలో చేరారు. తన కార్యాలయంలో మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ జారిపడ్డంతో కమల్‌హాసన్‌ కాలికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స…

సినీ నటుడు కమల్‌హాసన్‌ ఆసుపత్రిలో చేరారు. తన కార్యాలయంలో మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ జారిపడ్డంతో కమల్‌హాసన్‌ కాలికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స చేశారన్న ప్రచారం జరుగుతోంది. కనీసం నాలుగు వారాలపాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట. 

అయితే, ఇప్పటిదాకా కమల్‌ ఆసుపత్రిలో చేరడం, ఆయన కాలికి గాయమవడం, వైద్యులు శస్త్ర చికిత్స చేయడంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా కమల్‌హాసన్‌ కుటుంబ సభ్యుల తరఫున రాకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో 'శభాష్‌ నాయుడు' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆయన కుమార్తె శృతిహాసన్‌ కూడా నటిస్తోంది. మరోముఖ్యమైన పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. 

సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయ్యిందని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసి త్వరలో విడుదల చేస్తామని ఇటీవలే కమల్‌హాసన్‌ ప్రకటించారు. అయితే, ఈ పరిస్థితుల్లో కమల్‌హాసన్‌ కొన్నాళ్ళు 'రెస్ట్‌కే' పరిమితమైపోతే, సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశముంది. ఈ మధ్యకాలంలో కమల్‌ ఏ సినిమా చేసినా, అనుకున్న సమయానికి ఆ సినిమాని విడుదల చేయలేకపోతున్నారు. వివాదాల కారణంగా ఎక్కువగా కమల్‌హాసన్‌ సినిమాలు ఆలస్యమవుతుంటాయి. ఈసారి కమల్‌ సినిమాకి ఇలా అడ్డంకి ఏర్పడింది.