Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'కమ్మరాజ్యానికి' అయిదుకోట్లు

'కమ్మరాజ్యానికి' అయిదుకోట్లు

ఆర్జీవీ తీస్తున్న లేటెస్ట్ పోలిటికల్ మూవీ కమ్మ రాజ్యంలో కడపరెడ్లు. ఈ సినిమా విషయంలో ఆర్జీవీ కాస్త ఎక్కువ హడావుడే చేస్తున్నారు. ఆయన స్టయిల్ లో ఆయన భయంకరంగా ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్ లెవెల్ లోనే రేటు కూడా కోట్ చేస్తున్నారు. ఆంధ్ర ఏరియా అయిదు కోట్ల రేషియోలో చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఈ రేట్ సంగతి విని బయ్యర్లు కాస్త షాక్ అవతున్నారట. ఆంధ్ర అయిదు కోట్లు అంటే ఓ మాంచి మీడియం కమర్షియల్ సినిమా రేంజ్ అనుకోవాలి. ఒక్క ఉత్తరాంధ్రకే కోటి రూపాయల పైనే ఇవ్వాల్సి వుంటుంది. అంత వసూలు చేస్తుందా అన్నది అనుమానం. ఉత్తరాంధ్ర కోటి రూపాయలు రావాలంటే మాంచి కమర్షియల్ హిట్ అయిన చిన్న సినిమాతో సమానం.

కానీ చాలా కాలంగా ఆర్జీవీ ట్రాక్ రికార్డు సంగతి తెలిసిన వారు ఈ రేటు విని, సింపుల్ గా ఊరుకుంటున్నారు. దాదాపు దశాబ్ధకాలంగా ఆర్జీవీకి హిట్ అన్నది లేదు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా ఆంధ్రలో ఎన్నికల తరువాత వచ్చినందున, పెద్దగా సాధించింది లేదు. పైగా ఇప్పడు ఎన్నికలు అయిపోయాయి. జనానికి రాజకీయాల మీద అంత ఇంట్రస్ట్ లేదు. ఆ వేడీ లేదు. 

ఇలాంటి టైమ్ లో పొటిలికల్ సెటైర్ సినిమా స్టామినా అంతంత మాత్రంగా వుంటుంది. అందువల్ల ఏ రెండు మూడు కోట్ల రేషియో అంటే జనం ముందుకు వచ్చి కొంటారేమో కానీ, మరీ అయిదు కోట్ల రేషియోలో ఆంధ్ర అంటే కోనేందుకు ఎవరు ముందుకు వస్తారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?