Advertisement

Advertisement


Home > Politics - Gossip

సమస్య తీరాక దీక్ష.. డ్రామా కాదా?

సమస్య తీరాక దీక్ష.. డ్రామా కాదా?

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇసుక సమస్య మీద 14వ తేదీన 12 గంటల దీక్ష చేయదలచుకున్నారు. ఆ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇలాటి నేపథ్యంలో దీక్ష జరుగుతుందో లేదో కూడా డౌటే. కానీ.. దీక్ష పేరు మీద.. తెలుగుదేశం ఇసుకసమస్య మీద చాలా కష్టపడి పనిచేసేస్తున్నట్లుగా ప్రజల్లో బిల్డప్ ఇవ్వడం వారి లక్ష్యం.

అందుకోసమే.. రకరకాల మీటింగులు గట్రా పెడుతున్నారు. చంద్రబాబు దీక్షకు అఖిలపక్షాల మద్దతు కోసం ఒక సమావేశం కూడా నిర్వహించారు.

నిజానికి ఈ దీక్ష జరుగుతుందో లేదో తెలీదు. ఎటూ పోలీసులు తనను అనుమతించరు. తినకుండా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఈలోగా.. వీలైనంత యాగీ చేస్తే కాస్త మైలేజీ వస్తుంది.. అది చాలు అని చంద్రబాబు అనుకుంటున్నట్లుంది.

గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలీసులు అనుమతి నిరాకరించిన దీక్షలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. పోలీసులు వాటిని చాలా కర్కశంగా అణిచేశారు.

ముద్రగడ దీక్షలకు పిలుపు ఇచ్చినప్పుడు.. ఇంటినుంచి బయటకు రానివ్వకుండా వందల మంది పోలీసుల్ని మోహరించి మరీ నిర్బంధించి... దీక్ష జరగకుండా చేశారు. ఇప్పుడు చంద్రబాబు పట్ల మాత్రం పోలీసులు భిన్నంగా ఎందుకుంటారు?

పైగా రాష్ట్రంలో రీచ్ లలో నీటి ప్రవాహాలు తగ్గి.. ఇసుక సమస్య ఒక కొలిక్కి వస్తోంది. ఇప్పటికి 90 వేల టన్నుల దాకా రోజుకు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. నాల్రోజుల్లో ఇసుక లభ్యత ఇంకా పెరుగుతుంది. అప్పుడు బాబు దీక్ష చేస్తే అది డ్రామా కాక ఇంకే అవుతుంది? ఆయనే ఆలోచించుకోవాలి.

ఏదోటి చేయకపోతే పార్టీ బతకడం కష్టం. కానీ ఏదైనా గట్టిగా చేయడానికి తగిన శక్తి లేదు. వార్ధక్యం వచ్చేసింది. కాబట్టే 12 గంటల దీక్ష అంటూ.. ఒక చిన్న డ్రామాను సెట్ చేసినట్టుగా ఉన్నది తప్ప.. చంద్రబాబుకు ఇసుక సమస్య తీరడం గురించి పెద్దగా పట్టింపు ఉన్నట్లు కనిపించడం లేదని పలువురు  భావిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?